గుంటూరు

కోటీ 74లక్షలతో జడ్పీ మిగులు బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 20: గుంటూరు జిల్లా ప్రజాపరిషత్ 2018-19 సంవత్సరానికి కోటీ 74లక్షల 5వేల మిగులు సూచిస్తూ 666 కోట్ల 67లక్షల 80వేల తో రూపొందించిన అంచనా బడ్జెట్‌ను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించినట్లు గిరిజన, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనంద్‌బాబు ప్రకటించారు. మంగళవారం జడ్పీ చైర్‌పర్సన్ జానీమూన్ అధ్యక్షతన 2017-18 సంవత్సరపు సవరణ, 2018-19 అంచనా బడ్జెట్‌ను సమావేశంలో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌పై ఎలాంటి చర్చ జరక్కుండానే ఏకగ్రీవంగా ఆమోదించినట్లు ప్రకటించటం విమర్శలకు దారితీసింది. కాగా 2017-18 ఆర్థిక సంవత్సరానికి కోటీ 84లక్షల 20వేల మిగులు తేల్చారు. రాబడులు, ఆదాయం కింద 659 కోట్ల 59 లక్షల 72వేలు సమకూరగా వ్యయాలు, ఖర్చుల కింద 657కోట్ల 75లక్షల 52వేలుగా సవరణ బడ్జెట్‌కు సభ్యులు ఆమోదం తెలిపారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి 666 కోట్ల 67లక్షల 80వేలు రాబడులు, ఆదాయం అంచనాకు గాను 664 కోట్ల 93 లక్షల 75వేలు ఖర్చులు, వ్యయాల కింద ప్రతిపాదించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనంద్‌బాబు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. వ్యవసాయం, విద్యా, వైద్యం, పంచాయతీరాజ్, జలవనరులశాఖ, సర్వశిక్షాభియాన్ తదితర శాఖల పరిధిలో అమలు జరుగుతున్న ప్రభుత్వ పథకాలపై సమావేశంలో చర్చించామని, సభ్యుల సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. జిల్లాలో కుష్టురోగుల సంఖ్య పెరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిని నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించినట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక సదుపాయాల కల్పన, ఆరోగ్య కేంద్రాల స్థాయి పెంపు, వసతుల కల్పన విషయంలో ప్రభుత్వం నిర్దిష్టమైన మార్గదర్శకాలు జారీచేసిందని ఇందుకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల్లో మెరుగైన సదుపాయాలు కల్పిస్తామన్నారు.

అగ్రిగోల్డ్ బాధితుల కోసం ఛలో అసెంబ్లీ
గుంటూరు (కొత్తపేట), ఫిబ్రవరి 20: రాష్ట్రప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులను వెంటనే ఆదుకోవాలని, లేనిపక్షంలో ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు హెచ్చరించారు. అగ్రిగోల్డ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న రెండో రోజు రిలే నిరాహార దీక్షలను జిల్లా ప్రధాన కార్యదర్శి అగస్టీన్ ప్రారంభించారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన ముప్పాళ్ల మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల రిలే నిరాహారదీక్షలతోనైనా ప్రభుత్వం స్పందించి రాష్ట్ర బడ్జెట్‌లో 4 వేల కోట్లు కేటాయించాలని, లేనిపక్షంలో ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. లక్షలాది మంది తరపున అసోసియేషన్ పోరాటాన్ని కొనసాగిస్తుంటే ప్రభుత్వం స్పందించక పోవడం దారుణమన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటాలు కొనసాగిస్తామన్నారు. అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అగస్టీన్ మాట్లాడుతూ బాధితులకు న్యాయం జరగడం కోసమే రిలే నిరాహారదీక్షలు చేపట్టామన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు. దీక్షలకు ఎఐటియుసి రాష్ట్ర నాయకులు ఎ అరుణకుమార్, ఏపి స్టేట్ గవర్నమెంటు రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు నాగరాజు తదితరులు మద్దతు తెలియజేశారు. రెండోరోజు దీక్షలో ఎన్ వెంకటేశ్వరరావు, ఆర్ నరసింహారావు, ఎ వెంకటేశ్వరరావు, కోట మాల్యాద్రి, గని, కుమార్‌నాయక్, చేపర్తి నాగేశ్వరరావు, సుబ్బారావు, దేవనాయక్, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.