గుంటూరు

ఆహారభద్రతా చట్టం అమలులో అవకతవకలను ఉపేక్షించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 23: రాష్ట్రంలో ఆహార భద్రతా చట్టం సమర్ధవంతంగా అమలు చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఫుడ్ సేఫ్టీ కమిషన్ చైర్మన్ జేఆర్ పుష్పరాజ్ పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం ఆహార భద్రత చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహార భద్రత చట్టం-2013, ఫుడ్ సేఫ్టీ రూల్స్-2017పై అధికారులు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఆహార భద్రత చట్టం పౌరుల హక్కుగా చెప్పారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో మూడంచల విధానాన్ని అమలుకోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. స్ర్తి, శిశు సంక్షేమశాఖ ద్వారా అమలులో ఉన్న పౌష్టికాహార పథకం, పౌరసరఫరాలశాఖ పంపిణీ చేసే నిత్యావసరాలు సకాలంలో అందుతున్నదీ లేనిదీ ఆహార కమిషన్ పర్యవేక్షించాలన్నారు. ఆహార భద్రత అమలులో ఎక్కడ అవకతవకలు జరిగినా సూమోటోగా స్వీకరించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో కోటీ 44లక్షల తెలుపురంగు రేషన్‌కార్డులు ఉండగా, పల్స్ సర్వేలో కోటీ 32లక్షలు ఉన్నట్లు గుర్తించారన్నారు. తొలివిడతగా గుంటూరు జిల్లాలోని నకరికల్లు, మాచవరం, ఈపూరు, ముప్పాళ్ల, విశాఖపట్నం జిల్లా అనకాపల్లి, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుతో కలుపుకుని 7 మండలాల్లో 310 రేషన్ దుకాణాల్లో తనిఖీ చేసినట్లు చెప్పారు. ఇందులో మొత్తం లక్షా 63వేల 468 కార్డులను పరిశీలించగా 36వేల 847 కార్డుల వివరాలు గుర్తించలేక పోయామన్నారు. నిత్యావసరాలు, పౌష్టికాహారం పంపిణీలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఆహార పదార్థాల కల్తీపై అధికారులు దృష్టి సారించాలన్నారు. సమావేశంలో పౌరసరఫరాల కమిషనర్ రాజశేఖర్, డైరెక్టర్ జి రవిబాబు, ఆహార కమిషన్ సభ్యులు కృష్ణమ్మ, స్వర్ణ్భారతి, విజయకుమార్, ఎల్ బి వెంకట్రావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.