గుంటూరు

పాత పన్నులన్నీ కలిపితే జిఎస్‌టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, ఫిబ్రవరి 25: జిఎస్టీ అనేది కొత్తది కాదని, పాత పన్నులన్నింటినీ కలిపి జిఎస్‌టిగా కేంద్ర ప్రభుత్వం మార్పు చేసిందని, ఈ విధానం వల్ల సామాన్యులపై ఎటువంటి భారం ఉండదని సెంట్రల్ టాక్స్ అండ్ ఎక్సైజ్ గుంటూరు కమిషనరేట్ పరిధి కమిషనర్ ఎం శ్రీహరిరావు పేర్కొన్నారు. ఆదివారం సిఆర్‌డిఏ పరిధిలోని తెనాలి బోస్ రోడ్‌లో కేంద్ర వస్తు సేవ పన్నులు, కేంద్ర పన్నుల పర్యవేక్షణాధికారి ప్రాంతీయ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కమిషనర్ శ్రీహరిరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్న పన్నులన్నింటినీ కలిపి రాష్ట్ర ప్రభుత్వంతో మమేకమై కేంద్ర వస్తు సేవా పన్నుల విభాగంగా ఏర్పాటు చేసి జిఎస్టీ అని నామకరణం చేసిందన్నారు. దీనిద్వారా ధరలు పెరుగుతాయని జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదన్నారు. వ్యాపారులు నిజాయితీగా వ్యాపారాలు చేసుకునేందుకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించాల్సిన పన్నులు సరైన మార్గంలో చెల్లించేందుకు జిఎస్‌టి ఓ చక్కని మార్గంగా పేర్కొన్నారు. అలాగే ఓ వ్యాపారి సంవత్సరం ఆదాయం 20 లక్షల రూపాయలు దాటితేనే జిఎస్‌టి కిందకు వస్తారని, అంతకు మించిన వ్యాపారం చేసి కూడా లెక్కలు చూపకుంటే అనుమానం వచ్చిన వ్యాపారాలపై దాడులు, విచారణ జరిపించి పన్నులు వసూలు చేసే అధికారం ఈ కార్యాలయానికి ఉంటుందన్నారు. వ్యాపారులు జిఎస్‌టి అమలులోకి వచ్చిన తర్వాత వినియోగదారులకు బిల్లు ఇచ్చేందుకు నిరాకరిస్తే 08644-221855 ఫోను నెంబరుకు ఫిర్యాదు చేయవచ్చునన్నారు. తెనాలి ప్రాంతీయ కార్యాలయం పరిధిలోకి తెనాలి, రేపల్లె, బాపట్ల, పొన్నూరు మున్సిపాలిటీలతో పాటు దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు, తెనాలి, చండూరు, అమృతలూరు, చెరుకుపల్లి, వేమూరు, రేపల్లె, నగరం, నిజాంపట్నం, కర్లపాలెం, పివిపాలెం, బాపట్ల, పొన్నూరు, చేబ్రోలు మండల గ్రామాల పరిధిలో అన్ని రకాల వ్యాపారాలు, వస్తు వినియోగ పన్నులు దీనికిందకు వస్తాయని వివరించారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న వ్యాట్ కూడా ఇక నుండి జిఎస్‌టి కిందకే వస్తాయని తెలిపారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 50/50 శాతం ఎస్‌జిఎస్‌టి, సిజిఎస్‌టి రెండు రకాల పన్నులు వసూళ్ళు, వాటాలు ఉంటాయని వివరించారు. ఈ క్రమంలో తెనాలి ప్రాంతీయ కార్యాలయం నుండి 100 కోట్ల వరకు ఆదాయం లక్ష్యంగా చేకూరుతుందని భావిస్తున్నామని, ప్రస్తుతం 1200 వరకు జిఎస్‌టి చెల్లింపు వ్యాపారాలు, ఫ్యాక్టరీలను గుర్తించామని, భవిష్యత్తులో ఈ సంఖ్య మరో వేయి వరకు పెరగవచ్చునని భావిస్తున్నట్లు చెప్పారు. అనంతరం పలువురు వ్యాపారులు మాట్లాడుతూ కొందరు వ్యాపారులు 20 లక్షల కంటే తక్కువ వ్యాపారులతో కుమ్మక్కై వారి పాన్ కార్డులు ఉపయోగించి ఎక్కువ మొత్తంలో వ్యాపారాలు చేస్తూ లాభాలు గణిస్తున్నారని, ఫలితంగా నిజాయితీగా వ్యాపారం చేసే వారికి నష్టం జరుగుతోందనే అనుమానాలు, సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకురాగా ఆయన స్పందిస్తూ వాటిని నివృత్తి చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ నాగేశ్వరరావు, తెనాలి ప్రాంతీయ కార్యాలయం సూపరింటెండెంట్ పి కోటేశ్వరరావు, ఇన్‌స్పెక్టర్ ఎస్‌కె హబీత్, సిబ్బంది, వ్యాపారులు పాల్గొన్నారు.

కార్మికులకు అన్యాయం జరిగితే ఆమరణ దీక్ష
గుంటూరు, ఫిబ్రవరి 25: జూట్‌మిల్లు యాజమాన్యంతో కుమ్మకై ప్రభుత్వం కార్మికులకు అన్యాయం చేయాలని చూస్తే ఆమరణ దీక్షకు దిగడానికి కూడా వెనకాడబోమని జూట్‌మిల్లు పరిరక్షణ సమితి కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి హెచ్చరించారు. ఆదివారం జూట్‌మిల్లు వద్ద కార్మికులతో పరిరక్షణ సమితి సభ్యులు ఏర్పాటుచేసిన సమావేశంలో అప్పిరెడ్డి మాట్లాడారు. కష్టాన్ని నమ్ముకున్న కార్మికులను మాటలతో మభ్యపెట్టాలని చూస్తున్న యాజమాన్య దురాలోచనకు ప్రభుత్వం మద్దతు ఇవ్వకూడదన్నారు. గడిచిన రెండున్నర సంవత్సరాలుగా మిల్లు అక్రమ లాకౌట్ చేస్తే పనులు లేక, కుటుంబ పోషణ భారమై కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించలేక పోయిందన్నారు. 1994లో ప్రస్తుత యాజమాన్యం కార్మికులకు 40 శాతం యాజమాన్యానికి 60 శాతం వాటాతో మిల్లును నడిపేందుకు ఒప్పందం చేసుకుని ఇప్పటికైనా ప్రభుత్వం యాజమాన్య నియంతృత్వ ధోరణికి కళ్లెం వేసి కార్మికులకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో ప్రభుత్వంపై అమీ తుమీ తేల్చుకునేందుకు ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని అప్పిరెడ్డి హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ నగర కార్యదర్శి భావన్నారాయణ, కార్మిక నాయకుడు ఎబ్బూరి పాండురంగ, నూకరాజు, నరసింహారావు, సాంబ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

బలమైన ఉద్యమంతోనే చేనేత రక్షణ సాధ్యం
సతైనపల్లి, ఫిబ్రవరి 25: ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా 7వ మహాసభ ఆదివారం సతైనపల్లిలో దీపాల సత్యన్నారాయణ, అనుముల వీర బ్రహ్మం, చిట్టీల సీతారామాంజనేయుల అధ్యక్షతన జరిగింది. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం వ్యవస్థాపక కార్యదర్శి జెవి రాఘవులు మహాసభలో ప్రారంభ ఉపన్యాసం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత వ్యతిరేక విధానాల వలన చేనేత పరిశ్రమ దెబ్బతింటుందని అన్నారు. చేనేతకు కేటాయించిన 511 రకాల రిజర్వేషన్‌లు ఉల్లంఘించిన పవర్‌లూం యజమానులపై చర్యలు తీసుకోకుండా వారికి కొమ్ముకాస్తున్న పాలకులకు వ్యతిరేకంగా చేనేత కార్మికులు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ కలసి కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ చేనేతను నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. మహాసభ ప్రారంభ సూచికగా జెండా ఆవిష్కరణ సీనియర్ చేనేత నాయకులు అనంత పిచ్చయ్య ఆవిష్కరించారు. అనంతరం గత మహాసభ నుండి ఇప్పటి వరకు చనిపోయిన వారికి సంతాపం తెలియజేశారు. చేనేత వర్గం చేసే పోరాటాల్లో ఇతర వృత్తిదారులు కూడా భాగస్వాములను చేసుకుని పోరాడాలని పిలుపు నిచ్చారు. వేదిక భట్టిప్రోలు చేనేత సహకార అధ్యక్షులు బట్టు నాగమల్లేశ్వరరావు పాల్గొని నాయకులను వేదిక ఆహ్వానించి మహాసభను జయప్రదం చేయాలని కోరారు.

సాగర్ డ్యాంను పరిశీలించిన డిఎస్‌ఆర్‌పి కమిటీ
విజయపురిసౌత్, ఫిబ్రవరి 25 : నాగార్జునసాగర్ డ్యాంను ఆదివారం సాగర్ డ్యాం భద్రత అధ్యయన కమిటీ సభ్యులు పరిశీలించారు. నాగార్జునసాగర్ డ్యాం భద్రతకు సంబంధించి ప్రతి ఏడాది డిఎస్‌ఆర్‌పి కమిటీ పరిశీలించి డ్యాం భద్రతకు సంబంధించి ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తుంది. డిఎస్‌ఆర్‌పి చైర్మన్ ఎం ఎస్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు, సాగర్ డ్యాం ఉన్నతాధికారులు సాగర్ ప్రధాన డ్యాం, స్పిల్‌వే, ఎర్త్‌డ్యాం, టైగర్ వ్యాలీలను పరిశీలించారు. నాగార్జునసాగర్ డ్యాంకు ఎగువ నుండి ఎక్కువగా వరద నీరు వచ్చి చేరుతున్నా అప్పుడు డ్యాం 26 క్రస్ట్‌గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసినా అప్పటికీ ఎగువ నుండి వస్తున్న వరద ప్రవాహం ఎక్కువైన సమయంలో డ్యాం భద్రతకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా నీటిని టైగర్ వ్యాలీలోకి మళ్లించటానికి ఉన్న అవకాశాలను వీరు పరిశీలించారు. రెండు రోజులపాటు ఈ కమిటీ సాగర్ డ్యాంను పూర్తి స్థాయిలో పరిశీలించి అనంతరం డ్యాంపైన భద్రతకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందించనున్నారు. ఈ కమిటీలో జి ఎస్ చౌదరి, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ సెడాబ్లూసీ, రాజస్థాన్ కనస్ట్రక్షన్స్ నిపుణులు బి ఎం ఉపాధ్యాయ, జి ఎఫ్ ఐ భవాని రామ్‌శంకర్, సాగర్ సి ఇ సునీల్, ఎస్ ఇ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

5లోపు తేల్చాల్సిందే .. లేకుంటే ఉద్యమిస్తాం
అచ్చంపేట, ఫిబ్రవరి 25: మార్చి 5వ తేదీలోగా బీజేపీ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని, లేకుంటే గ్రామస్థాయి నుంచి ఉద్యమాలు ఆరంభమవుతాయని ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్ హెచ్చరించారు. ఆయన ఆదివారం మండలంలోని ఓర్వకల్లు గ్రామంలో పర్యటించి అనంతరం విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ నేత సోము వీర్రాజు కయ్యానికి కాలు దువ్వుతున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రా ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఇలాంటి వాటికి భయపడబోమన్నారు. ప్రజాబలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటే ఉందన్నారు. రాష్ట్భ్రావృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. దేశంలోనే అత్యన్నత రాష్ట్రంగా ఉండేందుకు ముఖ్య ప్రణాళికలను సిద్ధం చేసిందన్నారు. శ్రీగంగాదేవి పేరంటాళ్లమ్మ అమ్మవారి ఆలయంలో జూన్‌లోపు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. గ్రామంలో అనారోగ్యానికి గురైన కోటా రోశయ్యను పరామర్శించి 5 వేల రూపాయల ఆర్థికసాయాన్ని ఆయన అందజేశారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ ఎన్ వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు రాయిడి విశే్వశ్వరరావు, ఆశీర్వాదం, పివి రామారావు, అరుణ్, సీతయ్య, ఎస్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

టుబాకో బోర్డు ఆఫీసర్స్ సంఘ అధ్యక్షుడిగా మహిధర్
గుంటూరు, ఫిబ్రవరి 25: ఆలిండియా టుబాకో బోర్డు ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడుగా విఎం మహిధర్ ఎంపికయ్యారు. ఆదివారం గుంటూరులోని టుబాకో బోర్డు ప్రధాన కార్యాలయంలో జరిగిన అసోసియేషన్ ఎన్నికలలో మహిధర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా జి దామోదర్, ప్రధాన కార్యదర్శిగా సిహెచ్ ఏసుదాసు, జాయింట్ సెక్రటరిగా డి నాగేశ్వరరావు, కోశాధికారిగా పి మీరాకుమారిని ఎన్నుకున్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా టి రమేష్, డి వేణుగోపాల్, ఎం బాబురావు, సి గోపీనాథ్‌లు ఎన్నికయ్యారు.