గుంటూరు

సమసమాజ నిర్మాణానికి నాంది... భారతీయ హైందవ ధర్మమేః

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), ఫిబ్రవరి 25: అందరితో మంచిగా ఉండటం, ప్రేమతో మాట్లాడటం, సమ సమాజ శ్రేయస్సుకు పాటుపడటం నేర్పింది, ఆ మాటకొస్తే... నాంది పలికిందీ మన ప్రాచీన హైందవ ధర్మమేనని భారత సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తి, ఈ జిల్లా వాసి జస్టిస్ లావు నాగేశ్వరరావు స్పష్టంచేశారు. ఆదివారం రాత్రి గుంటూరులోని విశాలమైన శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిర వేదికపై బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యాన 2018 స్ఫూర్తి అవార్డుల ప్రదానోత్సవం నయనానందకరంగా జరిగింది. నగరం నుండే కాకుండా జిల్లాలోని నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఆహ్వానించబడిన విభిన్న రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో సమాజానికి తమదైన రీతిలో సేవలందిస్తున్న నలుగురు సామాజిక సేవా తత్పరులకు అవార్డులను సభాసదుల హర్షధ్వానాల నడుమ ముఖ్యఅతిథి, న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు, సభకు అధ్యక్షత వహించిన అవార్డుల జ్యూరీ చైర్మన్, అలహాబాదు హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అంబటి లక్ష్మణరావు, విశిష్ఠ అతిథి, రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, కృష్ణమూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు బి కృష్ణమూర్తి దంపతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి జస్టిస్ నాగేశ్వరరావు ప్రసంగిస్తూ ఎందుకు కృష్ణమూర్తి స్ఫూర్తి అవార్డులను నాలుగు సంవత్సరాలుగా ఇస్తున్నారా అని నాలో ప్రశ్న ఉదయించిందని, అయితే అవార్డులు అందుకుంటున్న వ్యక్తులను చూసిన తర్వాత కృష్ణమూర్తి ఫౌండేషన్ చేస్తున్న సేవలు వెలకట్టలేనివని ఆయన ప్రశంసించారు. అవార్డు గ్రహీతలందరినీ ఆయన అభినందించారు. జస్టిస్ లక్ష్మణరావు తన అధ్యక్షోపన్యాసంలో నేటి ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని, అయితే దీని ఫలితాలు యువతపై అమితమైన ప్రభావం చూపించడం కారణాన మన సంస్కృతి, సంప్రదాయాలు, మానవీయ విలువలు కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేటి తరానికి ఈ అవార్డులు స్ఫూర్తిని కల్గజేస్తాయన్నారు. శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ నేటి తరానికి ఒక లక్ష్యం నిర్ధేశం చేయగల దిట్టలను ఎన్నుకుని ఈ అవార్డులను అందజేయడం, ఈ సత్కార్యక్రమంలో తాను అతిథిగా పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సిలికానాంధ్ర స్థాపకుడు కూచిబొట్ల ఆనంద్ మనమెక్కడ ఉన్నా మన మాతృభాషను మర్చిపోరాదన్నారు. చివరిగా పురస్కారం అందుకున్న యువకుడు, కాన్పూర్ సమీపంలోని చౌబేపూర్ గ్రామంలో ఓ టీ కొట్టును నిర్వహిస్తూ అదే తన కార్యాలయంగా ఎంచుకుని ఆర్టీఐ చట్టంద్వారా సమాచార సైనికుడిగా పోరాటం సలుపుతూ దేశవ్యాప్త గుర్తింపు పొందిన స్వచ్చంధ కార్యవర్త కెఎం యాదవ్ ఏది జరుగుతున్నా నేటి యువత చూస్తూ ఊరుకోకూడదని, మనకున్న చట్టాలు, న్యాయ వ్యవస్థ, హక్కులను ఆయుధంగా తీసుకుని అందరి శ్రేయస్సు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రధానంగా ఓల్గా కలం పేరుతో సుప్రసిద్ధురాలైన శ్రీవాద కవయిత్రి పోపూరి లలితకుమారి మాట్లాడుతూ జిల్లాలో యడ్లపాడులో జన్మించిన తనకు గుంటూరు నగరంతో, పలు విద్యాసంస్థలతో, అంతకుమించి సాహిత్య, సారస్వత రంగాలతో విడదీయరాని అనుబంధం ఉందన్నారు. బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ తన పట్ల చూపిన ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. సభలో గుంటూరు మాజీ బిషప్ రెవరెండ్ డాక్టర్ గాలిబాలి, ఆచార్య వి బాలమోహన్‌దాస్, చరిత్ర పరిశోధకుడు డాక్టర్ వకులాభరణం రామకృష్ణ, అక్కిరెడ్డి హనుమారెడ్డి (యుఎస్‌ఎ), కళ్లం హరనాథ్‌రెడ్డి, డాక్టర్ మద్దినేని గోపాలకృష్ణ, డాక్టర్ రమాతారక్‌నాథ్, డాక్టర్ ఎన్ మంగాదేవి, వివిఐటి ఛైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, ఆర్‌విఆర్ విద్యా కళాశాల కార్యదర్శి జి మంగయ్య, అధ్యాపకుడు రవికృష్ణ, అవార్డుల కమిటీ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

సింహ వాహనంపై వైభవంగా నృసింహుని గ్రామోత్సవం
మంగళగిరి, ఫిబ్రవరి 25: శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి స్వామివారు సింహ వాహనంపై పురవీధుల్లో ఊరేగారు. వైభవంగా జరిగిన స్వామివారి సింహవాహన ఉత్సవానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. హింసించే స్వభావం కలవారిని హింసించేవాడు నరసింహుడు. నరులలో సింహంవంటివా డు నారసింహుడు. నర - సింహ రూపుడైన స్వామి సింహవాహనోత్సవం మృ త్యువునకు కూడా మృత్యువును కలిగించగలిగిన స్వామివారి ఈ ఉత్సవాన్ని తిలకించిన వారికి దుర్మార్గుల వలన కలిగే భయం కలుగుతుందని ఉపప్రధాన అర్చకులు వివరించారు. అభయాయాచ సా ధూనాం , సాధుజనులకు అభయాన్ని స్తూ దుర్మార్గుల్లోని దుర్మార్గాన్ని పారద్రోలేందుకు స్వామివారు సింహ వా హన రూఢుడై దర్శనమిస్తామని ప్రతీతి. పక్షుల్లో గరుత్మంతుడు, మృగాల్లో సిం హము తానే అని స్వామి చెప్పారని అర్చకులు వివరించారు. సింహవాహనం పై ఉభయ దేవేరులతో దర్శన మిచ్చిన నరసింహ స్వామిని భక్తులు నేత్రపర్వంగా తిలకించారు. ఆలయం నుంచి ప్రారంభమైన ఉత్సవం మెయిన్ బజార్‌లో మిద్దెసెంటర్‌వరకు వెళ్లి తిరిగి ఆలయానికి చేరిం ది. ఆలయ ఇఓ మండెపూడి పానకాలరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆలయం ఎధుట గల కళావేదికపై కూచిపూడి నృత్యప్రదర్శన, భక్తిరంజని, ఇంద్రజాల ప్రదర్శన, భజన, అన్నమాచార్య సంకీర్తనలు మొదలైన కార్యక్రమాలు ని ర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం స్వామివారి హంసవాహన ఉత్సవం, రాత్రి గజవాహన ఉత్సవం జరుగుతుందని భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఇఓ పానకాలరావు కోరారు.