గుంటూరు

ఇన్నర్ రింగ్‌రోడ్డు భూ సమీకరణకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, ఫిబ్రవరి 25: రాష్ట్ర రాజధాని అమరావతి నగరం చుట్టూ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్)కు వేల ఎకరాల భూములు తీసుకునే యత్నాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమం నిర్వహిద్దామని స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి 16 వేల ఎకరాలను భూ సమీకరణ లేదా సేకరణ పద్ధతిలో తీసుకోవాలని ప్రభుత్వం చేస్తున్న యత్నాలకు వ్యతిరేకంగా ఆదివారం పట్టణంలోని నాగోజీ కల్యాణ మండపంలో అఖిలపక్ష రైతుసంఘాల ఆధ్వర్యంలో ఏటుకూరి గంగాధరరావు అధ్యక్షతన జరిగిన బాధిత రైతుల సదస్సులో ఎమ్మెల్యే ఆర్కే ప్రసంగించారు. అభివృద్ధి పేరిట టిడిపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, ప్రశ్నించిన వారిని అభివృద్ధి నిరోధకులుగా పేర్కొంటున్నారని ఎమ్మెల్యే ఆర్కే ధ్వజమెత్తారు. ఇప్పటికే 3446 ఎకరాలు సేకరించడానికి సిఆర్‌డిఎ అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారని, 75 మీటర్ల వెడల్పున రోడ్డు వేస్తామని చెబుతూ ఇరువైపులా 500 మీటర్లు వంతున పంట భూములు తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆర్కే అన్నారు. 2013 భూసేకరణ చట్టం ద్వారా భూములు అవసరమైన మేరకే తీసుకోవాలని ఆయన అన్నారు. భూ సమీకరణ సరైంది కాదని, ఐతే సమీకరణ ద్వారానే తీసుకుంటే ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడ్డి ముడుపులు తీసుకునే ఆలోచన చేస్తున్నారని, ఈ తప్పుడు విధానాలను అడ్డుకుని తీరాల్సిందేనని, భూములన్నీ పోతే అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆయనన్నారు. ఎన్నికల సమీపంలోనే ఉన్నందున బాబు పాలన అంతమయ్యే వరకు పోరాడి ఎన్నికల్లో చరమగీతం పాడాలని ఆయనన్నారు. రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి నరసింహారావు, సిపిఎం రాష్ట్ర నేత పి బాబూరావు, ఎఎంసి మాజీచైర్మన్ సుంకర రఘుపతిరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, నూతక్కి పిఎసిఎస్ అధ్యక్షుడు చీడిపూడి చంద్రశేఖరరెడ్డి, నాన్ పొలిటికల్ జెఎసి అధ్యక్షుడు అప్పికట్ల శ్రీహరినాయుడు, రైతుసంఘాల ప్రతినిధులు రాధాకృష్ణ, అనే్న శేషారావు, చెన్నారెడ్డి, పీవీ కృష్ణ, సింహాద్రి లక్ష్మారెడ్డి తదితరులు ప్రసంగించారు. భూములు కోల్పోతున్న 42 గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించి మార్చి 13న సిఆర్‌డిఎ కార్యాలయాన్ని ముట్టడించాలని సదస్సు తీర్మానించింది.