గుంటూరు

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొన్నూరు, మే 22: పెట్రోల్, డీజిల్ ధరల పెంపు పట్ల ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఆటోవర్కర్స్ పట్టణ కూడలిలో మంగళవారం ధర్నా జరిపారు. ఎఐటియుసి నేత ఆరేటి రామారావు అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమంలో ఆటో వర్కర్స్ యూనియన్ నేతలు జి గోవిందరాజు, ఎన్ చిన్నయ్య, సీతారామయ్య, ఎం రమేష్‌బాబు, బాజీ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

రోడ్లపై చెత్తవేస్తే అపరాధరుసుం చెల్లించాల్సిందే
తెనాలి, మే 22: తెనాలి పట్టణంలోని 40 వార్డుల పరిధిలోని రోడ్లపై చెత్త, ఇతర వ్యర్ధాలు వేసేవారిని ఉపేక్షించేది లేదని ఫైన్ చెల్లించక తప్పదని మున్సిపల్ హెల్త్ అధికారి డాక్టర్ బీవీ రమణ హెచ్చరించారు. మంగళవారం పట్టణంలోని ఐతానగర్, ప్రకాష్‌నగర్, మున్సిపల్ కార్యాలయం పరిధిలోని మురుగు కాలువలు, రోడ్లను ఆయన పారిశుద్ధ్య పరిశీలకులు, కార్మికులతో కలసి పరిశీలించారు. ఈసందర్భంగా డాక్టర్ రమణ మాట్లాడుతూ రోడ్లపై విచ్చల విడిగా చెత్త వేయటం, వాహనాల రాకపోకలు, సమీప ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదన్నారు. ఈమేరకు పలువురు వ్యక్తులు రోడ్లపై చెత్త వేయటాన్ని గుర్తించి వారికి అపరధ రుసుం విధించారు. కౌన్సిల్ ఆమోదం మేరకు ఇటువంటి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఆనంతరం ప్రకాష్‌నగర్, మున్సిపల్ కార్యాలయం సమీపంలో మురుగుకాలువల్లో పేరుకుపోయిన చెత్త, మురుగును కార్మికుల సహకారంతో బయటకు తీయించి వ్యర్ధాలను ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డుకు తరలించారు. కార్యక్రమంలో పారిశుద్య పరిశీలకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.