గుంటూరు

హోదాతోనే రాష్ట్భ్రావృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), మే 22: రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో రాష్టవ్య్రాప్తంగా చేపట్టిన దీక్షల్లో భాగంగా గుంటూరు తాలూకా కార్యాలయం వద్ద మంగళవారం నగర కార్యదర్శి కోట మాల్యాద్రి అధ్యక్షతన దీక్ష నిర్వహించారు. దీక్షలను ప్రారంభించిన ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాజధానికి నిధులు, విశాఖ రైల్వేజోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలను సాధారణ దీక్షలుగా పరిగణిస్తే బీజేపీకి 2019 ఎన్నికల్లో చేదు అనుభవం తప్పదని హెచ్చరించారు. ఐదు కోట్ల ఆంధ్రులకు అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదన్నారు. హోదా సంజీవని కాదన్న ముఖ్యమంత్రి నేడు హోదాయే రాష్ట్భ్రావృద్ధికి సంజీవని అంటూ డిమాండ్ చేస్తున్నారన్నారు. సీపీఐ కేంద్ర కమిటీ సభ్యుడు వి శ్రీనివాసరావు మాట్లాడుతూ హోదా విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరు ఆంధ్రులను అవమానించే విధంగా ఉందన్నారు. హోదా కోసం ఆత్మగౌరవ పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ హోదా సాధించే వరకు నిరంతరం పోరాటాలు చేస్తామన్నారు. సీపీఎం నగర కార్యదర్శి నళినీకాంత్ మొదటి రోజు దీక్షలను విరమింపజేస్తూ దీక్షాపరులకు నిమ్మరసం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, సీపీఎం తూర్పు జిల్లా కార్యదర్శి పాశం రామారావు, ప్రత్యేక హోదా సాధన సమితి జిల్లా అధ్యక్షుడు పివి మల్లిఖార్జునరావు, ఉపాధ్యక్షుడు అవధానుల హరి, గని, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి కోలా స్వాతి, సీపీ ఐ నాయకులు సురేష్‌బాబు, నూతలపాటి చిన్న, చల్లా చినాంజనేయులు, షేక్ అమీర్‌వలి తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక హోదా సాధన కోసం ఐక్య పోరాటం అవశ్యం
మంగళగిరి, మే 22: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు కలసికట్టుగా ఐక్య పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు. మంగళవారం స్థానిక గాలిగోపురం ఎదుట గల గాంధీ విగ్రహం వద్ద సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యాన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేపట్టారు. మున్సిపల్ వైస్‌చైర్మన్ నందం బ్రహ్మేశ్వరరావు దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. సాయంత్రం దీక్షాశిబిరానికి విచ్చేసిన చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ హోదాకోసం అన్ని పార్టీలు ఒకే గొడుగు కిందికి వచ్చి పోరాటం చేయాల్సిన సమయంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధర్మపోరాటం పేరుతో విశాఖపట్నంలో టీడీపీ ఆధ్వర్యాన సదస్సు నిర్వహించడం సమంజసం కాదన్నారు. హోదాకోసం ఉద్యమం ఉధృతమవుతున్న సమయంలో దీన్ని విచ్ఛిన్నం చేయడానికి కేంద్రంలో బీజేపీ కుట్రలు చేస్తోందని, ఆంధ్రప్రదేశ్‌లో కొంతమంది నాయకులు బీజేపీ వలలో పడకుండా ఉంటేనే లక్ష్యసాధన సులువవుతుందని శ్రీనివాస్ అన్నారు. కర్ణాటకలో తెలుగుప్రజలు కొన్ని ప్రాంతాల్లో బీజేపీని ఓడించడం తెలుగు ప్రజల విజయంగానే భావించాలి తప్ప చంద్రబాబు ఇచ్చిన పిలుపువల్ల ఎంతమాత్రం కాదని శ్రీనివాస్ అన్నారు. దీక్షలో ఉన్న కాంగ్రెస్, వామపక్షాల ప్రతినిధులకు శ్రీనివాస్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప జేశారు. సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, పీసీసీ సభ్యుడు షేక్ సలీం, సీపీఎం నాయకులు జెవీ రాఘవులు, ఎస్‌ఎస్ చెంగయ్య, చేనేత కార్మికసంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు, సీపీఐ నాయకులు కంచర్ల కాశయ్య, జాలాది జాన్‌బాబు, కాంగ్రెస్ నేతలు గోలి సాంబశివరావు, కౌన్సిలర్ ఉయ్యాల సత్యనారాయణ, రైతుసంఘం నేత యార్లగడ్డ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.