గుంటూరు

29న ఏసీబీ కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 24: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 29వ తేదీన గుంటూరు నగరంలో పర్యటించనున్నారు. నగరంలో వైద్య కళాశాల వద్ద నూతనంగా నిర్మించిన ఏసీబీ కార్యాలయంతో పాటు విద్యానగర్ 1వ లైనులో ఏర్పాటుచేసిన వేద ఐఐటీ అండ్ ఇనే్యకాస్ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జిల్లా కలెక్టర్ కోన శశిధర్, అర్బన్ ఎస్‌పి సిహెచ్ విజయారావు, నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీకేష్ బి లత్కర్ తదితరులు నూతనంగా నిర్మించిన భవనాలను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వేద ఐఐటి భవనాన్ని సందర్శించిన కలెక్టర్, ఎస్‌పి సంస్థ ప్రతినిధులను వివరాలు అడిగి తెలుసుకుని చేపట్టాల్సిన చర్యలను వివరించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో గుంటూరు ఆర్డీవో శ్రీనివాసరావు, అడిషనల్ ఎస్‌పి వైటి నాయుడు, ఏసీబీ అధికారులు, పురపాలక, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ
నియంతృత్వ పోకడలను ఎండగట్టండి
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, జూన్ 24: దేశ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న నియంతృత్వ పోకడలను ప్రతి ఒక్కరూ పౌరుడు ముందడుగు వేసి ఎండగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక బ్రాడీపేటలోని ఎస్‌హెచ్‌ఒ సమావేశ మందిరంలో ప్రత్యేక హోదా ఆత్మగౌరవ కమిటీ ఆధ్వర్యంలో విభజన చట్టంలో ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటులో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల తీరుపై నిరసన సభ నిర్వహించారు. సభకు ఆత్మగౌరవ పోరాట కమిటీ కన్వీనర్ అవధానుల హరి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రామకృష్ణ మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువత భవిష్యత్తులో ఆటలాడుకుంటున్నాయని అన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు జరిగితే మన రాష్ట్ర యువతకు, నిరుద్యోగులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. రేపటి భవిష్యత్ దృష్ట్యా నేటి విద్యార్థి లోకం పాఠశాల స్థాయి నుండి విద్యాలయాల వరకు ఉద్యమ బాట పట్టాలని సూచించారు. విద్యార్థులు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు. పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభమవుతున్న ఈ తరుణంలో రాష్టవ్య్రాప్తంగా విద్యార్థులను చైతన్యవంతులను చేసేందుకు ప్రత్యేక హోదా సాధన సమితి కార్యాచరణ రూపొందించడం జరిగిందన్నారు. ఈనెల 29వ తేదీన కడపలో బంద్ నిర్వహిస్తున్నామని, మిగతా అన్ని జిల్లాల్లో కూడా సంఘీభావ సభలు జరుపుతున్నామన్నారు. సమావేశంలో ప్రకాశం జిల్లా అభివృద్శి వేదిక అధ్యక్షుడు చుండూరి రంగారావు, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ టి సేవాకుమార్, రత్నాకరరావు, ఎల్ దుర్గాప్రసాద్, సిహెచ్ తిరుపతి యాదవ్, బి ప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం పాలకుల వైఫల్యమే: కృష్ణయ్య
మంగళగిరి, జూన్ 24: కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ పాలన గడిచిన నాలుగేళ్లలో అన్ని రంగాల్లో విఫలమైందని పారిశ్రామిక రంగంలో 36 దేశాలు తిరిగిన మోదీ దేశంలో ఒక్క పరిశ్రమ కూడా పెట్టలేక పోయారని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడానికి కారణం పాలకుల వైఫల్యమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి కృష్ణయ్య విమర్శించారు. ఆదివారం పట్టణంలోని మార్కండేయ కల్యాణ మండపంలో జరిగిన మంగళగిరి నియోజకవర్గ సీపీఎం సభ్యుల విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్‌ఎస్ చెంగయ్య, బీ వెంకటేశ్వర్లు అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. కృష్ణయ్య తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ వచ్చే సాధారణ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించడమే సీపీఎం ధ్యేయమన్నారు. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబించిన ఫలితంగా పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాపురించిందని కృష్ణయ్య విమర్శించారు. దేశవ్యాప్తంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఇతర బూర్జువా పార్టీలు మినహా కలిసొచ్చే అన్ని పార్టీలతో ప్రత్యామ్నాయ రాజకీయ విధానాన్ని ఏర్పాటు చేసేందుకు సీపీఎం కృషి చేస్తోందన్నారు. బీజేపీ పాలన కార్పొరేట్ల ఆదాయాన్ని రెట్టింపుచేసే విధంగా ఉందని, స్వదేశీ, విదేశీ పెట్టుబడీ దారులకు మద్దతుగా బీజేపీ పాలన కొనసాగిస్తోందన్నారు. ప్రపంచం గ్లోబల్ విలేజ్‌గా మారిందని, పెట్టుబడీ దారులు మరింత పెట్టుబడీదారులుగా, పేదలు మరింత పేదలుగా మారారని కృష్ణయ్య అన్నారు. ఒకప్పుడు అమెరికా చెప్పిన విధంగా ప్రపంచం ఉందని, నేడా పరిస్థితి పోయి ప్రపంచ వాణిజ్యంలో అమెరికా తట్టుకోలేక ప్రపంచ వాణిజ్య సంస్థ నుంచి బైటికి వచ్చిందని, ప్రపంచీకరణ అమెరికాకు ఉపయోగ పడకపోగా నష్టం తేవడంతో అమెరికాలో సంక్షోభం ఏర్పడిందని, బ్రిటన్‌లోను సంక్షోభం నెలకొందని, పెట్టుబడిదారీ దేశాల్లో సంక్షోభాలు పెరిగిపోయి ప్రజలు, కార్మికులు సమ్మెలు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థకు ఎదురు లేదనుకున్న స్థితిలో సోషలిస్టు వ్యవస్థ అందుకు భిన్నంగా ప్రజలకు వౌలిక సదుపాయాలు కల్పిస్తూ ముందుకు పోతోందన్నారు. భవిష్యత్తులో పెట్టుబడిదారీ వ్యవస్థ మరింత సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ కార్పొరేట్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఊడిగం చేస్తోందని, నేడు టీడీపీ బీజేపీ నుంచి విడిపోయి ప్రత్యేక హోదా కున్న సానుభూతిని అడ్డుపెట్టుకుని అధికారంలోకి రావటానికి ప్రయత్నిస్తోందన్నారు. ఆర్ధిక విధానాల్లో బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్, వైసీపీలకు ఎలాంటి తేడాలు లేవన్నారు. 2013 భూ సేకరణ చట్టాన్ని సవరణ చేసిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి టీడీపీ మద్దతు తెలిపిందని, వైసీపీ కూడా నోరు మెదపటం లేదని విమర్శించారు. మతాన్ని రెచ్చగొట్టే బీజేపీ విధానాన్ని వైసీపీ, టీడీపీలు వ్యతిరేకించలేని పరిస్థితిలో ఉన్నాయని, గత ఫిబ్రవరిలో ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని బాబూరావు అన్నారు. రాష్ట్రంలో రాజకీయమార్పు రావాలంటే ప్రజలను చైతన్య పరచాల్సిన అవసరం ఉందని, ద్విముఖ పోటీ పోయి బహుముఖ పోటీలు వస్తే ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయం గురించి ఆలోచిస్తారని, బీజేపీతో ఎన్నికల తరువాత కలవబోమని టీడీపీ, వైసీపీలు చెప్పలేని పరిస్థితి నెలకొందని బాబూరావు అన్నారు. బీజేపీపై వైసీపీ వైఖరేంటో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంగన్‌వాడీలకు, వీఆర్‌ఓలకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచడం సీఐటీయు ఆందోళన ఫలితమేనని బాబూరావు న్నారు. జనసేన పార్టీ కమ్యూనిస్టులతో కలిసి పనిచేస్తామని చెప్పినందున ఆ పార్టీతో కలిసి పని చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, ఎం రవి, జెవీ రాఘవులు, డీ వెంకటరెడ్డి, శివశంకర్, వై గంగాధరరావు, డీ శ్రీనివాసకుమారి, డీ కోటేశ్వరి, ఎం పకీరయ్య తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల్లో వివాదాల పరిష్కారానికి శాంతి కమిటీలు ఏర్పాటు
అమరావతి, జూన్ 24: స్థానిక గుడ్‌షప్పర్డ్ కానె్వండ్ తరపున లీగల్ ప్రాజెక్టు ఏర్పాటుచేసి గ్రామాల్లో ఉన్న భూ, కుల, మత వివాదాలను శాంతియుతంగా పరిష్కరించేందుకు శాంతి కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు లీగల్ ప్రాజెక్టు మానిటరింగ్ కో ఆర్డినేటర్ అయ్యదొరై జాన్ అరుల్ దాస్, ప్రాజెక్టు కో ఆర్డినేటర్ లక్ష్మణ్ వివరించారు. ఆదివారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ గ్రామాల్లో రాజకీయాలకు అతీతంగా కులానికి ఒకరిని ఈ కమిటీలో తీసుకోవడం జరుగుతుందని, ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేలా చూడటమే తమ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమన్నారు. వివాదా పరిష్కారం - శాంతిమార్గం అనే అంశంపై ఒక ప్రశ్నాపత్రాన్ని సిద్ధంచేసి స్థానికులు ఇచ్చే జవాబుల ఆధారంగా తమ కార్యకలాపాలు ముందుకు సాగిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో సిస్టర్ అరుణాజార్జి, ఫ్లోరా, వినరశి, ప్రియాక సహాయకులుగా పనిచేస్తారని వారు వివరించారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
నకరికల్లు, జూన్ 24: తెలంగాణా నుండి నరసరావుపేట వైపువెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయాలపాలైన సంఘటన మండలంలోని దేచవరం సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. నకరికల్లు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణా రాష్ట్రంలోని కొండ్రపోలు గ్రామం నుండి నరసరావుపేటకు మినీ లారీ బయలుదేరింది. ప్రమాదవశాత్తు చెట్టుకు ఢీ కొనడంతో పాతలోతు నాను (33), నరేష్‌నాయక్ (33) సంఘటనా స్ధలంలోనే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలవ్వడంతో చికిత్స నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు ఎస్‌ఐ అనిల్‌కుమార్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

నిర్లిప్తత వీడండి.. మార్పురాకుంటే ఎలా?
* తీవ్రరూపం దాల్చిన నీటి ఎద్దడిపై జస్టిస్ లావు నాగేశ్వరరావు హెచ్చరిక
పెదనందిపాడు, జూన్ 24: పెదనందిపాడు మంచినీటి చెరువు అడుగంటింది.. ఉన్న కొద్దిపాటి నీరు రంగుమారి దుర్వాసన వెదజల్లుతోంది.. గుక్కెడు నీటి కోసం గ్రామస్థులు వెంపర్లాడుతున్నారు.. గ్రామాన్ని దశాబ్దాలుగా తాగునీటి సమస్య పట్టిపీడిస్తోంది.. తాగునీటి అవసరాలు తీర్చేనిమిత్తం ఎనిమిది గ్రామాలకు ప్రయోజనం చేకూర్చుతూ అప్పాపురం వద్ద బకింగ్‌హాం కాల్వపై 40 లక్షల రూపాయల వ్యయంతో పైలెట్ ప్రాజెక్టు నిర్మించారు. కొన్నాళ్ల పాటు సజావుగా నడుస్తూ వచ్చిన ప్రాజెక్టు నిర్వహణ నేడు ప్రశ్నార్ధకంగా మారింది. విద్యుత్ బకాయిలు పట్టిపీడిస్తుండటంతో పథకం మూలనపడింది. సకాలంలో బిల్లులు చెల్లించాల్సిన గ్రామ పంచాయతీలు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటంతో తాగునీటి కోసం క్షేత్రస్థాయిలో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. మంచినీటి క్యాన్ 20 రూపాయల చొప్పున వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు పెదనందిపాడు, వరగాని, నాగులపాడులకు తాగునీరు అందించేందుకు వరగాని సమీపంలో కొల్లావారి చెరువు నిర్మించారు. సాగర్ కాల్వ ద్వారా సకాలంలో నీరు నింపక పోవడంతో చెరువు అడుగంటిపోయింది. ప్రజాప్రతినిధులకు ముందుచూపు కొరవడటంతో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో వేసవి సెలవల దృష్ట్యా విశ్రాంతి కోసం వచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు గ్రామ సమస్యలపై ఉదయం, సాయంత్రం కాలినడకన తిరుగుతూ అధ్యయనం ప్రారంభించారు. తాను గుర్తించిన సమస్యల పరిష్కారానికి గ్రామస్థులతో ముఖాముఖి చర్చిస్తూ వస్తున్నారు. పెదనందిపాడును తాను దత్తత తీసుకున్నప్పటికీ అనుకున్నంత అభివృద్ధి జరగలేదని భావిస్తున్నా.. మంచినీరు దుర్వాసన వస్తోంది.. ఎందుకు ఈ పరిస్థితి దాపురించిందో ఎప్పుడైనా ఆలోచించారా, ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో అంతుపట్టకుండా ఉంది. మనలో చైతన్యం రాకుంటే పరిస్థితులు ఎప్పటికీ మారవంటూ సున్నితంగా హెచ్చరించారు. ప్రజలు సుఖంగా సౌకర్యంగా ఉండాలంటే మంచినీటి వసతి ఎంతో ముఖ్యమంటూ సెలవిచ్చారు. ఈ సమస్య పరిష్కారానికి నడుం బిగించాలని గ్రామస్థులకు స్పష్టంచేశారు. ఇప్పటికే తాను వివిధరకాలుగా ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు పెదనందిపాడు మురుగుకాల్వలో పేరుకుపోతున్న చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్ధాలను చూస్తూ అసంతృప్తి వ్యక్తంచేశారు. నేను ఎన్నో రకాలుగా ఆలోచిస్తున్నా మీలో మార్పు రాకపోతే నేను ఒక్కడినే ఏం చేయగలనంటూ నిస్సహాయత వ్యక్తంచేశారు.

మహిళలకు చట్టసభలో సమాన ప్రాతినిధ్యం కల్పించాలి
పొన్నూరు, జూన్ 24: మహిళలు, చిన్నారులపై జరిగే లైంగిక దాడులను అరికట్టాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ఏపి మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి కోలా స్వాతి డిమాండ్ చేశారు. పొన్నూరు సీపీఐ కార్యాలయంలో ఆదివారం జరిగిన మహిళా సమాఖ్య జనరల్ బాడీ సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. సమాఖ్య పట్టణ అధ్యక్షురాలు రావూరి సుగుణ సమావేశానికి అధ్యక్షత వహించారు. స్వాతి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచినా ఇంకా స్ర్తిలు వివక్షతకు గురవుతూనే ఉన్నారన్నారు. చిన్నారులు మొదలు పండు ముసలి వరకు దాడులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవలికాలంలో గుంటూరు జిల్లా దాచేపల్లితో పాటు మోదుకూరు, తెనాలి తదితర ప్రాంతాల్లో దారుణ సంఘటనలు జరిగాయని, ప్రభుత్వం ఒకరిపై ఒక్కో విధంగా స్పందించడం దురదృష్టకరమన్నారు. రాజ్యాంగం మాత్రం స్ర్తిలకు సమాన హక్కులు కల్పించామని చెప్తున్నా, చట్టసభల్లో మహిళలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడం దురదృష్టకరమన్నారు. మహిళా హక్కుల సాధనకై ముందుకు సాగాలని స్వాతి పిలుపునిచ్చారు.
సభలో సీపీ ఐ పట్టణ కార్యదర్శి కీర్తి వెంకటేశ్వర్లు, ప్రజానాట్య మండలి నాయకుడు ఆరేటి రామారావు, సమాఖ్య నేతలు కె స్వప్నసుధ, కె సుశీల, రమణ తదితరులు పాల్గొన్నారు.

29న ఏసీబీ కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, జూన్ 24: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 29వ తేదీన గుంటూరు నగరంలో పర్యటించనున్నారు. నగరంలో వైద్య కళాశాల వద్ద నూతనంగా నిర్మించిన ఏసీబీ కార్యాలయంతో పాటు విద్యానగర్ 1వ లైనులో ఏర్పాటుచేసిన వేద ఐఐటీ అండ్ ఇనే్యకాస్ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జిల్లా కలెక్టర్ కోన శశిధర్, అర్బన్ ఎస్‌పి సిహెచ్ విజయారావు, నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీకేష్ బి లత్కర్ తదితరులు నూతనంగా నిర్మించిన భవనాలను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వేద ఐఐటి భవనాన్ని సందర్శించిన కలెక్టర్, ఎస్‌పి సంస్థ ప్రతినిధులను వివరాలు అడిగి తెలుసుకుని చేపట్టాల్సిన చర్యలను వివరించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో గుంటూరు ఆర్డీవో శ్రీనివాసరావు, అడిషనల్ ఎస్‌పి వైటి నాయుడు, ఏసీబీ అధికారులు, పురపాలక, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.

చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు కన్నాకు లేదు
* వైసీపీ, బీజేపీవి దొంగనాటకాలు: జీవీ ఆంజనేయులు
గుంటూరు (కొత్తపేట), జూన్ 24: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మంత్రిగా ఉన్నప్పుడు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారని, చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు ఆయనకు లేదని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే చంద్రబాబు నాయుడుపై 23 అక్రమ కేసులు బనాయించి ఏ ఒక్కటీ నిరూపించలేక తోక ముడిచారని, చంద్రబాబు నాయుడును జైలుకు పంపించక పోతే రాజీనామా చేస్తానని కన్నా తాజాగా వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చివరిదాకా కాంగ్రెస్‌లో ఉండి అక్రమ కేసుల నుండి బయటపడేందుకు బీజేపీలోకి వెళ్లిన కన్నా మచ్చలేని నేతగా, నీతి, నిజాయితీకి నిలువుటద్దమైన చంద్రబాబుపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. తాను మంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, దోచుకుతినడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. బీజేపీ, వైసీపీ పార్టీలు కుమ్మక్కై స్వార్ధ ప్రయోజనాలకై దొంగనాటకాలు ఆడుతున్నారన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో అవినీతిపరులకు కొమ్ముకాస్తూ రాష్ట్రానికి కేంద్రం ద్రోహం చేస్తుంనద్నారు. దేశంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంలో చంద్రబాబు నాయుడు నెంబర్ వన్‌గా నిలిచారన్నారు. విలేఖర్ల సమావేశంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎండి హిదాయత్, కంచర్ల శివరామయ్య, చంద్రగిరి ఏడుకొండలు, చిట్టాబత్తిన చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.