గుంటూరు

నిర్లిప్తత వీడండి.. మార్పురాకుంటే ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదనందిపాడు, జూన్ 24: పెదనందిపాడు మంచినీటి చెరువు అడుగంటింది.. ఉన్న కొద్దిపాటి నీరు రంగుమారి దుర్వాసన వెదజల్లుతోంది.. గుక్కెడు నీటి కోసం గ్రామస్థులు వెంపర్లాడుతున్నారు.. గ్రామాన్ని దశాబ్దాలుగా తాగునీటి సమస్య పట్టిపీడిస్తోంది.. తాగునీటి అవసరాలు తీర్చేనిమిత్తం ఎనిమిది గ్రామాలకు ప్రయోజనం చేకూర్చుతూ అప్పాపురం వద్ద బకింగ్‌హాం కాల్వపై 40 లక్షల రూపాయల వ్యయంతో పైలెట్ ప్రాజెక్టు నిర్మించారు. కొన్నాళ్ల పాటు సజావుగా నడుస్తూ వచ్చిన ప్రాజెక్టు నిర్వహణ నేడు ప్రశ్నార్ధకంగా మారింది. విద్యుత్ బకాయిలు పట్టిపీడిస్తుండటంతో పథకం మూలనపడింది. సకాలంలో బిల్లులు చెల్లించాల్సిన గ్రామ పంచాయతీలు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటంతో తాగునీటి కోసం క్షేత్రస్థాయిలో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. మంచినీటి క్యాన్ 20 రూపాయల చొప్పున వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు పెదనందిపాడు, వరగాని, నాగులపాడులకు తాగునీరు అందించేందుకు వరగాని సమీపంలో కొల్లావారి చెరువు నిర్మించారు. సాగర్ కాల్వ ద్వారా సకాలంలో నీరు నింపక పోవడంతో చెరువు అడుగంటిపోయింది. ప్రజాప్రతినిధులకు ముందుచూపు కొరవడటంతో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో వేసవి సెలవల దృష్ట్యా విశ్రాంతి కోసం వచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు గ్రామ సమస్యలపై ఉదయం, సాయంత్రం కాలినడకన తిరుగుతూ అధ్యయనం ప్రారంభించారు. తాను గుర్తించిన సమస్యల పరిష్కారానికి గ్రామస్థులతో ముఖాముఖి చర్చిస్తూ వస్తున్నారు. పెదనందిపాడును తాను దత్తత తీసుకున్నప్పటికీ అనుకున్నంత అభివృద్ధి జరగలేదని భావిస్తున్నా.. మంచినీరు దుర్వాసన వస్తోంది.. ఎందుకు ఈ పరిస్థితి దాపురించిందో ఎప్పుడైనా ఆలోచించారా, ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో అంతుపట్టకుండా ఉంది. మనలో చైతన్యం రాకుంటే పరిస్థితులు ఎప్పటికీ మారవంటూ సున్నితంగా హెచ్చరించారు. ప్రజలు సుఖంగా సౌకర్యంగా ఉండాలంటే మంచినీటి వసతి ఎంతో ముఖ్యమంటూ సెలవిచ్చారు. ఈ సమస్య పరిష్కారానికి నడుం బిగించాలని గ్రామస్థులకు స్పష్టంచేశారు. ఇప్పటికే తాను వివిధరకాలుగా ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు పెదనందిపాడు మురుగుకాల్వలో పేరుకుపోతున్న చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్ధాలను చూస్తూ అసంతృప్తి వ్యక్తంచేశారు. నేను ఎన్నో రకాలుగా ఆలోచిస్తున్నా మీలో మార్పు రాకపోతే నేను ఒక్కడినే ఏం చేయగలనంటూ నిస్సహాయత వ్యక్తం చేశారు.