గుంటూరు

పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం పాలకుల వైఫల్యమే: కృష్ణయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, జూన్ 24: కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ పాలన గడిచిన నాలుగేళ్లలో అన్ని రంగాల్లో విఫలమైందని పారిశ్రామిక రంగంలో 36 దేశాలు తిరిగిన మోదీ దేశంలో ఒక్క పరిశ్రమ కూడా పెట్టలేక పోయారని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడానికి కారణం పాలకుల వైఫల్యమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి కృష్ణయ్య విమర్శించారు. ఆదివారం పట్టణంలోని మార్కండేయ కల్యాణ మండపంలో జరిగిన మంగళగిరి నియోజకవర్గ సీపీఎం సభ్యుల విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్‌ఎస్ చెంగయ్య, బీ వెంకటేశ్వర్లు అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. కృష్ణయ్య తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ వచ్చే సాధారణ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించడమే సీపీఎం ధ్యేయమన్నారు. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబించిన ఫలితంగా పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాపురించిందని కృష్ణయ్య విమర్శించారు. దేశవ్యాప్తంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఇతర బూర్జువా పార్టీలు మినహా కలిసొచ్చే అన్ని పార్టీలతో ప్రత్యామ్నాయ రాజకీయ విధానాన్ని ఏర్పాటు చేసేందుకు సీపీఎం కృషి చేస్తోందన్నారు. బీజేపీ పాలన కార్పొరేట్ల ఆదాయాన్ని రెట్టింపుచేసే విధంగా ఉందని, స్వదేశీ, విదేశీ పెట్టుబడీ దారులకు మద్దతుగా బీజేపీ పాలన కొనసాగిస్తోందన్నారు. ప్రపంచం గ్లోబల్ విలేజ్‌గా మారిందని, పెట్టుబడీ దారులు మరింత పెట్టుబడీదారులుగా, పేదలు మరింత పేదలుగా మారారని కృష్ణయ్య అన్నారు. ఒకప్పుడు అమెరికా చెప్పిన విధంగా ప్రపంచం ఉందని, నేడా పరిస్థితి పోయి ప్రపంచ వాణిజ్యంలో అమెరికా తట్టుకోలేక ప్రపంచ వాణిజ్య సంస్థ నుంచి బైటికి వచ్చిందని, ప్రపంచీకరణ అమెరికాకు ఉపయోగ పడకపోగా నష్టం తేవడంతో అమెరికాలో సంక్షోభం ఏర్పడిందని, బ్రిటన్‌లోను సంక్షోభం నెలకొందని, పెట్టుబడిదారీ దేశాల్లో సంక్షోభాలు పెరిగిపోయి ప్రజలు, కార్మికులు సమ్మెలు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థకు ఎదురు లేదనుకున్న స్థితిలో సోషలిస్టు వ్యవస్థ అందుకు భిన్నంగా ప్రజలకు వౌలిక సదుపాయాలు కల్పిస్తూ ముందుకు పోతోందన్నారు. భవిష్యత్తులో పెట్టుబడిదారీ వ్యవస్థ మరింత సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ కార్పొరేట్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఊడిగం చేస్తోందని, నేడు టీడీపీ బీజేపీ నుంచి విడిపోయి ప్రత్యేక హోదా కున్న సానుభూతిని అడ్డుపెట్టుకుని అధికారంలోకి రావటానికి ప్రయత్నిస్తోందన్నారు. ఆర్ధిక విధానాల్లో బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్, వైసీపీలకు ఎలాంటి తేడాలు లేవన్నారు. 2013 భూ సేకరణ చట్టాన్ని సవరణ చేసిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి టీడీపీ మద్దతు తెలిపిందని, వైసీపీ కూడా నోరు మెదపటం లేదని విమర్శించారు. మతాన్ని రెచ్చగొట్టే బీజేపీ విధానాన్ని వైసీపీ, టీడీపీలు వ్యతిరేకించలేని పరిస్థితిలో ఉన్నాయని, గత ఫిబ్రవరిలో ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని బాబూరావు అన్నారు. రాష్ట్రంలో రాజకీయమార్పు రావాలంటే ప్రజలను చైతన్య పరచాల్సిన అవసరం ఉందని, ద్విముఖ పోటీ పోయి బహుముఖ పోటీలు వస్తే ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయం గురించి ఆలోచిస్తారని, బీజేపీతో ఎన్నికల తరువాత కలవబోమని టీడీపీ, వైసీపీలు చెప్పలేని పరిస్థితి నెలకొందని బాబూరావు అన్నారు. బీజేపీపై వైసీపీ వైఖరేంటో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంగన్‌వాడీలకు, వీఆర్‌ఓలకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచడం సీఐటీయు ఆందోళన ఫలితమేనని బాబూరావు న్నారు. జనసేన పార్టీ కమ్యూనిస్టులతో కలిసి పనిచేస్తామని చెప్పినందున ఆ పార్టీతో కలిసి పని చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, ఎం రవి, జెవీ రాఘవులు, డీ వెంకటరెడ్డి, శివశంకర్, వై గంగాధరరావు, డీ శ్రీనివాసకుమారి, డీ కోటేశ్వరి, ఎం పకీరయ్య తదితరులు పాల్గొన్నారు.