గుంటూరు

కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ పోకడలను ఎండగట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 24: దేశ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న నియంతృత్వ పోకడలను ప్రతి ఒక్కరూ పౌరుడు ముందడుగు వేసి ఎండగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక బ్రాడీపేటలోని ఎస్‌హెచ్‌ఒ సమావేశ మందిరంలో ప్రత్యేక హోదా ఆత్మగౌరవ కమిటీ ఆధ్వర్యంలో విభజన చట్టంలో ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటులో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల తీరుపై నిరసన సభ నిర్వహించారు. సభకు ఆత్మగౌరవ పోరాట కమిటీ కన్వీనర్ అవధానుల హరి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రామకృష్ణ మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువత భవిష్యత్తులో ఆటలాడుకుంటున్నాయని అన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు జరిగితే మన రాష్ట్ర యువతకు, నిరుద్యోగులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. రేపటి భవిష్యత్ దృష్ట్యా నేటి విద్యార్థి లోకం పాఠశాల స్థాయి నుండి విద్యాలయాల వరకు ఉద్యమ బాట పట్టాలని సూచించారు. విద్యార్థులు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు. పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభమవుతున్న ఈ తరుణంలో రాష్టవ్య్రాప్తంగా విద్యార్థులను చైతన్యవంతులను చేసేందుకు ప్రత్యేక హోదా సాధన సమితి కార్యాచరణ రూపొందించడం జరిగిందన్నారు. ఈనెల 29వ తేదీన కడపలో బంద్ నిర్వహిస్తున్నామని, మిగతా అన్ని జిల్లాల్లో కూడా సంఘీభావ సభలు జరుపుతున్నామన్నారు. సమావేశంలో ప్రకాశం జిల్లా అభివృద్శి వేదిక అధ్యక్షుడు చుండూరి రంగారావు, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ టి సేవాకుమార్, రత్నాకరరావు, ఎల్ దుర్గాప్రసాద్, సిహెచ్ తిరుపతి యాదవ్, బి ప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల్లో వివాదాల పరిష్కారానికి శాంతి కమిటీలు ఏర్పాటు
అమరావతి, జూన్ 24: స్థానిక గుడ్‌షప్పర్డ్ కానె్వండ్ తరపున లీగల్ ప్రాజెక్టు ఏర్పాటుచేసి గ్రామాల్లో ఉన్న భూ, కుల, మత వివాదాలను శాంతియుతంగా పరిష్కరించేందుకు శాంతి కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు లీగల్ ప్రాజెక్టు మానిటరింగ్ కో ఆర్డినేటర్ అయ్యదొరై జాన్ అరుల్ దాస్, ప్రాజెక్టు కో ఆర్డినేటర్ లక్ష్మణ్ వివరించారు. ఆదివారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ గ్రామాల్లో రాజకీయాలకు అతీతంగా కులానికి ఒకరిని ఈ కమిటీలో తీసుకోవడం జరుగుతుందని, ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేలా చూడటమే తమ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమన్నారు. వివాదా పరిష్కారం - శాంతిమార్గం అనే అంశంపై ఒక ప్రశ్నాపత్రాన్ని సిద్ధంచేసి స్థానికులు ఇచ్చే జవాబుల ఆధారంగా తమ కార్యకలాపాలు ముందుకు సాగిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో సిస్టర్ అరుణాజార్జి, ఫ్లోరా, వినరశి, ప్రియాక సహాయకులుగా పనిచేస్తారని వారు వివరించారు.