గుంటూరు

గుంటూరు బార్‌లో ఎన్నికల హోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (లీగల్), మార్చి 31: గుంటూరు బార్ అసోసియేషన్‌కు 2016-17 సంవత్సరానికి గురువారం ఎన్నికలు జరిగాయి. గురువారం ఉదయం నుండి అభ్యర్థులు ఎన్నికలు నిర్వహిస్తున్న బార్ అసోసియేషన్ భవనం ఎదుట మోహరించి న్యాయవాదులను తమకు ఓటు వేయవలసినదిగా అభ్యర్థించారు. ఈ ఏడాది మొత్తం 1776 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా, 1485 మంది ఓటర్లు పాల్గొన్నారు. ఈ ఏడాది ప్రతి పదవికి తీవ్రమైన పోటీ నెలకొంది. గుంటూరు బార్ అసోసియేషన్‌కు చెందిన పలువురు సీనియర్ న్యాయవాదులతో పాటు అసోసియేషన్‌లో సుదీర్ఘ కాలం నుండి సభ్యత్వమున్న మాజీ మేయర్ చుక్కా ఏసురత్నం, సోషలిస్టు పార్టీ నాయకుడు మోదుగుల పాపిరెడ్డి, చుక్కా రేచల్ దేవవరం తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ఎన్నికలు ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. రాత్రి 10 గంటల సమయానికి ప్రధాన కార్యదర్శి, మహిళా కార్యవర్గ సభ్యురాలి పదవికి జరిగిన పోటీ ఫలితాలు వెలువడ్డాయి. ప్రధాన కార్యదర్శిగా బండ్లమూడి చంద్రశేఖర్ 20 ఓట్ల స్వల్ప మెజార్టీతో 498 ఓట్లు సాధించి గెలుపొందారు. ఆయన సమీప ప్రత్యర్థి షేక్ మహబూబ్ సుభానికి 478 ఓట్లు లభించాయి. ఇదే పదవికి పోటీ చేసిన మాలే దేవరాజుకు 268 ఓట్లు, గత ఏడాది ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించి ఈ ఏడాది కూడా బరిలో దిగిన నీలం శంకరరావుకు 192 ఓట్లు మాత్రమే లభించాయి. మహిళా కార్యవర్గ సభ్యురాలిగా మువ్వా శ్రీవిద్య 617 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆమెకు 994 ఓట్లు రాగా ప్రత్యర్థి పాపాబత్తిన మాణిక్యానికి 377 ఓట్లు మాత్రమే లభించాయి. ఉపాధ్యక్ష పదవికి చింతల మల్లిఖార్జునరావు, బొమ్మనబోయిన శ్రీనివాసరావు మధ్య ఉత్కంఠ పోరు సాగుతుండగా మహిళా ప్రతినిధి పదవికి సింగపోగు బేబి అన్నపూర్ణ జాన్సీ విజయపథంలో పయనిస్తున్నారు. మూడు జూనియర్ కార్యవర్గ సభ్యుల పదవులకు కొప్పుల కిరణ్‌బాబు, రావి కోటేశ్వరరావు, మల్లెంపాటి సురేంద్రబాబు విజయం దిశగా లెక్కింపు జరుగుతోంది. ఇలా ఉండగా ప్రధానమైన బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి ఐదుగురు పోటీ పడగా గుత్తా వెంకటేశ్వరరావు, విష్ణుమొలకల శివనాగేశ్వరరావు మధ్య నువ్వా - నేనా అన్నట్లు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటికే కార్యదర్శిగా కనమర్లపూడి వెంకటేశ్వర్లు, కోశాధికారిగా చింతా రామకోటిరెడ్డి, లైబ్రరీ కార్యదర్శిగా మైనేని శరత్‌బాబు, క్రీడలు, సాంస్కృతిక విభాగపు కార్యదర్శిగా రాయపూడి మాణిక్యరావు, సీనియర్ కార్యవర్గ సభ్యులుగా సంకూరి రాజారావు, చిలకలపూడి రాజశేఖర్, కోటంరాజు శ్రీనివాసరావు, పెదపూడి వీరాంజనేయబజ్జీ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విదితమే.