గుంటూరు

పేదలందరికీ ఇళ్లు దక్కేవరకు పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, ఆగస్టు 17: పట్టణంలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు దక్కే వరకు అవిశ్రాంతంగా పోరాడతామని సీపీఎం పట్టణ కార్యదర్శి ఎస్‌ఎస్ చెంగయ్య అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట శుక్రవారం సీపీఎం ఆధ్వర్యాన పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, ఇళ్ల స్థలాలివ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా జరిపారు. వై కమలాకర్ అధ్యక్షతన జరిగిన సభలో చెంగయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అర్హులందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని, మంజూరైన ఇళ్లు కూడా కొంతమందికి మాత్రమే ఇచ్చారని, 8 వేల కుటుంబాల వారు సొంత ఇంటికోసం ఎదురు చూస్తున్నారని అధికారుల లెక్కలే చెబుతున్నాని ఆయన అన్నారు. చేనేత కార్మికసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ, కుర్రా ఏడుకొండలు, పీ రామచంద్రరావు, కే అంకమ్మరావు, పీ శ్రీనివాసరావు, ఎం నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

సమస్యల్లేని గ్రామాలుగా ఉంచండి
అచ్చంపేట, ఆగస్టు 17: సమస్యలు లేని గ్రామాలుగా అధికారులు గ్రామాల్లో తిరిగి పనిచేయాలని ఎంపీడీవో డి అనూరాధ అన్నారు. గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా కోనూరు గ్రామంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులతో ఆమె సమావేశమై మాట్లాడారు. వారంలో గురు, శుక్రవారాలు గ్రామాల్లో అధికారులు పర్యటించాలని చెప్పారు. తమ పర్యటనలో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించుకునేలా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. సమస్యలపై అన్ని శాఖలు వారి వారి పరిధిలలో పనులు చేయాలని అధికారులకు సూచించారు. డిసెంబర్ వరకు సాగే ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో క్రోసూరు ఎ ఎంసి ఉపాధ్యక్షుడు నందిగం ఆశీర్వాదం, గ్రామ మాజీ సర్పంచ్ తాళ్లూరి లక్ష్మీనారాయణ, పంచాయతీ కార్యదర్శి ఎస్‌కె నబి మరికొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.