గుంటూరు

సమాచారంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజుపాలెం, సెప్టెంబర్ 21: సమాజంలో పౌరులకు ఎదురైన సమస్యలను వారే పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని తెచ్చిందని, సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు శీలం నాగార్జున అన్నారు. శుక్రవారం రాజుపాలెం మండల పరిషత్ కార్యాలయంలో సమాచార హక్కుపై అవగాహన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో సమాచార హక్కు చట్టాన్ని ప్రతిపౌరుడు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తద్వారా మంచి పరిపాలన పొందవచ్చన్నారు. కొందరు సమాచార హక్కును స్వార్ధప్రయోజనాల కోసం ఆయుధంగా వినియోగించుకుంటున్నారన్నా. అనంతరం రాజుపాలెం మండల సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక కమిటీని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడుగా పొత్తూరి రామకృష్ణ, అధ్యక్షుడుగా తాళ్లూరి శౌరిబాబు, కార్యదర్శిగా ఆదూరి చిన్నబ్బాయి, కోకన్వీనర్‌గా పాపారావు, ప్రచార కార్యదర్శిగా శివ, కమిటీ సభ్యులుగా సైదులు, నాగేశ్వరరావు, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.