గుంటూరు

క్రీడాల్లోనూ రాణిస్తే మంచి భవిష్యత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తెనపల్లి, సెప్టెంబర్ 21: చదువుతోపాటుగా క్రీడాల్లో రాణిస్తే వారు ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. సత్తెనపల్లి పట్టణంలోని స్థానిక ఆర్‌సియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం 64వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ గుంటూరు ఆధ్వర్యంలో ఏపి సిఎం కప్ 2018-19 జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభ కార్యమ్రంలో సభాపతి ముఖ్యఅతిథిగా మాట్లాడారు. క్రీడారంగంలో భారతదేశానికి కీర్తి ప్రతిష్టలను తీసుకువచ్చిన ఆంధ్రరాష్ట్రానికి చెందిన సింధు, కింతాంబి శ్రీకాంత్‌లకు ఆర్థిక సహాయం చేసి వారికి నివాసస్థలాలను కేటాయించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం వారికి ఉద్యోగావకాశాలను కల్పించిందని వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఆటలో గెలుపు, ఓటములు సహజమని అయితే గెలిచినవారు ఇంకా ఉన్నత స్థానాలకు వెళ్లేందుకు కృషిచేయాలని, ఓడినవారు గెలిచేందుకు పట్టుదల కలిగి ఉండాలన్నారు. ఆటల్లో సత్తా, నైపుణ్యం కలిగి ఉంటే అదే వారికి ఉపాధికావచ్చని లేక ఉద్యోగావకాశాలు రావచ్చని అన్నారు. చంద్రబాబునాయుడు క్రీడాకారులకు మంచి ప్రోత్సాహం ఇస్తున్నారని రాజధాని అమరావతి ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి స్టేడియాన్ని నిర్మిస్తుండడం అందుకు ఉదాహరణ అని చెప్పారు. సత్తెనపల్లి పట్టణంలో జూనియర్ కళాశాలను కూడా మార్చి అన్ని సౌకర్యాలను కల్పించి వారికి మధ్యాహ్నం భోజనవసతి కూడా కల్పించామన్నారు. ముందుగా జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సభాపతి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఏఎన్ రామకృష్ణ మాట్లాడుతూ ఇక్కడినుంచే క్రీడల్లో రాణించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శాప్, ఐర్మన్ అంకమ్మ చౌదరి, మున్సిపల్ చైర్మన్ యెల్లినేడి రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

భారీ వర్షాం రైతుల హర్షం
* తటాకంలా మారిన బస్టాండ్
పొన్నూరు, సెప్టెంబర్ 21: పొన్నూరు ప్రాంతంలో శుక్రవారం ఉదయం దాదాపు గంట సమయం భారీవర్షం కురవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 21.2 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో మెట్ట ప్రాంత రైతులకు మేలు జరగడమే కాక మాగాణి పంట ఎదుగుదలకు కూడా తోడ్పడుతుందని హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఆర్థిక పరిపుష్టి సాధించేందుకు వ్యవసాయాధికారుల సూచనల మేరకు ప్రభుత్వ తోడ్పాటుతో వరిపంట పొలాల్లో గట్లపై వేసిన కందిపైరు మొలక దశలో ఉన్నందున ఈ వర్షం మొక్కల ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఉండగా శుక్రవారం ఉదయం కురిసిన భారీవర్షంతో స్థానిక ఆర్టీసీ డిపో ఆవరణతో పాటు లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడక తప్పలేదు. వర్షం రాకతో కాల్వల్లోని మురుగు వీధుల్లోకి పారడంతో వీధుల్లో నెలకొన్న మురుగు బెడదతో రోగాల బారిన పడాల్సి వస్తుందని ప్రజలు భయపడుతున్నారు.