గుంటూరు

రాష్ట్భ్రావృద్ధే చంద్రన్న ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శావల్యాపురం, సెప్టెంబర్ 21: రాష్ట్ర ప్రగతికై ప్రణాళికలతో బాటలు వేస్తూ రాష్టమ్రుఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందు చూపుతో పనిచేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. శుక్రవారం కారుమంచి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీరామారావు విగ్రహావిష్కరణలో మాట్లాడారు. పేదల అభివృద్ధికోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు పథకాలను ప్రవేశపెడుతూ, రాష్ట్భ్రావృద్ధికి పాటుపడుతున్నారని అన్నారు. రాష్ట్భ్రావృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేత జగన్ మతిపోయి మాట్లాడుతూ అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకు బీజేపీతో చేతులు కలిపారని అన్నారు. వినుకొండ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అన్ని రంగాల్లో ముందుండే విధంగా తయారు చేస్తున్న జీవీ ఆంజనేయులకు నియోజకవర్గంలో తిరుగులేదని అన్నారు. ఆంజనేయలు ఉన్నంతకాలం వినుకొండకు ఎమ్మెల్యే ఆయనే అన్నారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్భ్రావృద్ధికి చంద్రబాబు కృషిచేస్తున్నారని అన్నారు. జగన్ పార్టీ దొంగలపార్టీ అని, రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండడం జగన్‌కు ఇష్టం లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ ఉపప్రణాళిక నిధులను కాంగ్రెస్ హయాంలో పక్కదోవ పట్టించి, కాంగ్రెస్ నేతలు జేబులు నింపుకున్నారని అన్నారు. రైతులు, పేదల అభివృద్ధితో పాటు గోదావరి జలాలను సాగర్ కుడి కాలువకు అనుసంధానం చేసేందుకు సీఎం కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా గ్రామదర్శినిలో భాగంగా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు గ్రామంలో వీధివీధికి తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాసరావు, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ముమ్మనేని వెంకట సుబ్బయ్య, పలు అధికారులు, ప్రజాప్రతినిధులు, దేశం పార్టీ నేతలు పాల్గొన్నారు.

అలరించిన జబర్దస్త్ కళాకారులు
వినుకొండ, సెప్టెంబర్ 21: వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు జబర్దస్త్ కళాకారులు పాల్గొని ప్రేక్షకులను అలరించారు. స్థానిక కొత్తపేటలోని స్టేట్‌బ్యాంక్ రోడ్డులో చవితి వేడుకలను గాయత్రీ ఆర్కెష్ట్రా ఆధ్వర్యంలో జరిగిన సంగీత విభావరి కార్యక్రమంలో జబర్దస్త్ కళాకారులు అప్పారావు, నరేష్, అర్కెష్ట్రా బృందం పాల్గొని హస్యవల్లరితో అలరించి, కడుపుబ్బ నవ్వించారు.