గుంటూరు

చెల్లని బిల్లుతో కాపు రిజర్వేషన్లు రావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 21: శాసనసభ ఆమోదించిన కాపు రిజర్వేషన్ బిల్లు చట్టప్రకారం చెల్లదని, కర్ణాటక బీసీ కమిషన్ మాజీ చైర్మన్ ద్వారకానాథ్ ఇటీవల రాజమండ్రిలో తెలిపారని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకరరావు తెలిపారు. శుక్రవారం స్థానిక అరండల్‌పేటలోని బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వానికి మంజునాథ కమిషన్ పేరిట రెండు నివేదికలు వేర్వేరుగా అందాయని, వాటిలో ఒక నివేదికపై చైర్మన్ సంతకం లేదని, మరోనివేదికపై కమిటీ సభ్యుల సంతకాలు లేవని, ఈ పరిస్థితుల్లో అవి ఎలా చెల్లుబాటు అవుతాయని ప్రశ్నించారు. ఈ వాస్తవం తెలిసినందునే కాపునేత ముద్రగడ పద్మనాభం బిల్లును వెనక్కు తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారన్నారు. చైర్మన్ మంజునాథ కమిషన్ నివేదికలో కాపులకు సాంఘిక వెనుకబాటు తనం లేదని స్పష్టంచేసినట్లు తమకు సమాచారం ఉందన్నారు. ముగ్గురు కమిషన్ సభ్యులు విడివిడిగా అందజేసిన నివేదికలో కూడా కాపులకు రాజ్యాంగంలో సూచించినట్లుగా సాంఘిక వెనుకబాటు తనం ఉన్నట్లు స్పష్టత ఇవ్వలేకపోయినట్లు తె లిసిందన్నారు. అందుకే ఆ రెండు నివేదికలను రాష్ట్రప్రభుత్వం నేటికీ బహిర్గతం చేయలేదన్నారు. హైకోర్టు బహిర్గతం చేయాలని ఆదేశించినా ప్రభుత్వం మిన్నకుండిపోయిందని, అసలు ప్ర భుత్వం నివేదికలను ఎం దుకు బహిర్గతం చేయడం లేదో అర్థంకావడం లేదని, తక్షణమే అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కన్న మాస్టారు, రాష్ట్ర యువజన సంఘ అధ్యక్షుడు కుమ్మరి క్రాంతికుమార్, ప్రధాన కార్యదర్శి పరశా రంగనాథ్, నగర అధ్యక్షుడు వంశీకృష్ణ, కృష్ణబలిజ సంఘం నాయకులు అన్నం వీరరాఘవయ్య, మధుసూధనరావు, ఏసుబాబు, అంగిరేకుల గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

జగనన్నకు తోడుగా పాదయాత్ర
* వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి
సత్తెనపల్లి, సెప్టెంబర్ 21: వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న ప్రజా సంకల్పయాత్ర 11 జిల్లాలు దాటుకొని 24వ తేదీన 3 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకొని 25, 26, 27 తేదీల్లో జగనన్నకు తోడుగా సత్తెనపల్లి నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించినట్లు వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు శుక్రవారం తెలిపారు. ఈ పాదయాత్ర ముప్పాళ్ళ మండలం లంకెలకూరపాడు గ్రామంలో 25వ తేదీన ఉదయం 9 గంటలకు ప్రారంభ సమావేశంతో మొదలౌతుందని అన్నారు. చివరివరోజైన 27వ తేదీన పాకాలపాడులో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని వివరించారు. అనంతరం పట్టణంలో జరిగిన ఇంటింటికి నవరత్నాలు కార్యక్రమంలో అంబటి రాంబాబు పాల్గొన్నారు. పట్టణ పార్టీ అధ్యక్షులు నాగుల్‌మీరాన్, ప్రగతి విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ మక్కెన అచ్చయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆతుకూరి నాగేశ్వరరావు, నాయకులు కొండవీటి దత్తాత్రేయులు, ఆకుల హనుమంతరావు, యూనస్, కట్టా సాంబయ్య, సిరిగిరి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.