గుంటూరు

ఆచూకీలేని మూడవ బోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజాంపట్నం, మే 20: నిజాంపట్నం హార్బర్ నుండి వేట నిమిత్తం సముద్రంలోకి వెళ్ళిన మూడు బోట్లు, 18మంది జాలర్లు క్షేమంగా ఒడ్డుకు చేరినట్లు అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు జాలర్ల కుటుంబ సభ్యులు శుక్రవారం తెలిపారు. వాస్తవానికి మొదటి బోటు అందులోని 7 జాలర్లు మాత్రమే నిజాంపట్నం చేరుకున్నారని, రెండవ బోటులోని ఆరుగురు జాలర్లు బోటులో డీజిల్ అయిపోయిన కారణంగా చీరాల ఓడరేవు ప్రాంతంలో బోటును నిలిపియుంచారని అధికారులు చెబుతున్నట్లు మత్స్యకారులు చెబుతున్నారు. అయితే మూడవ బోటు వివరాలు మాత్రం అసలు చెప్పక పోవటంతో జాలరుల కుటుంబసభ్యులు శుక్రవారం మండల తహశీల్దార్ మోహన్‌కృష్ణను తనవారి ఆచూకీ చెప్పాలంటూ నిలదీశారు. మూడవ బోటు పీత బాలవర్ధనరాజు అందులోని 7జాలర్ల ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదని తెలపటంతో అందులోని ఐదుగురు జాలర్ల కుటుంబసభ్యులు ఆందోళనకు గురౌతూ తనవారి ఆచూకీ కోసం అధికారులను ఆశ్రయించారు. తప్పిపోయిన బోటులోని జాలర్ల కుటుంబాల వారు తహశీల్దార్‌ను కలిసి తనవారు క్షేమంగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వారికోసం కోర్టుగార్డు, మెరైన్, సిబ్బంది సముద్రంలో గాలిస్తున్నట్లు శనివారం సాయంత్రంలోగా సమాచారం సేకరిస్తామని తహశీల్దార్ మోహన్‌కృష్ణ వారికి హామీ ఇచ్చారు. తుఫాన్ ప్రభావంతో నిజాంపట్నంలో 4వ నెంబరు ప్రమాద సూచిని ఎగురవేసినట్లు బోట్ కంజర్వేటర్ వెంకటేశ్వరరావు శుక్రవారం తెలిపారు.