గుంటూరు

కాజ గ్రామాభివృద్ధికి ఐక్యంగా కృషిచేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, నవంబర్ 15: కాజ గ్రామాభివృద్ధికి ఐక్యంగా కృషిచేద్దామని, సమస్యలు గుర్తించి చెబితే పరిష్కారానికి తన వంతు కృషిచేస్తానని ఆర్‌టీఐ కమిషనర్ బీవీ రమణకుమార్ అన్నారు. మండల పరిధిలోని కాజగ్రామంలో గురువారం నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా ప్రసంగించారు. ఆర్హులకు వేదికపై రేషన్‌కార్డులను పంపిణీ చేశారు. తడిచెత్త, పొడిచెత్త వేర్వేరుగా సేకరణకు రెండు రకాల డస్ట్‌బిన్‌లను అందజేశారు. ఈ సందర్భంగా రమణకుమార్ మాట్లాడుతూ గ్రామంలో అవసరమైన వౌలిక సదుపాయాల కల్పనకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. బీసీ కార్పొరేషన్ ఈడీ టీ గెడ్డమ్మ, జడ్‌పీటీసీ మెంబర్ ఆకుల జయసత్య, తహశీల్దార్ జీ వసంతబాబు, ఎంపీడీఓ జీ వీరాంజనేయులు, పంచాయితీ కార్యదర్శి రమేష్, ఎంపీటీసీ సభ్యుడు ఈదా ప్రతాపరెడ్డి తదితరలు పాల్గొన్నారు. డస్ట్‌బిన్‌ల ద్వారా సేకరించిన వ్యర్థాలను ఆటోల ద్వారా ఎస్‌డబ్ల్యుపీసీ షెడ్డుకు తరలిస్తామని, ప్రతి ఒక్కరూ గ్రామాన్ని శుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని అధికారులు కోరారు. తొలుత పాదయాత్రగా గ్రామంలో ప్రాథమిక పాఠశాలలను, వెటర్నటీ ఆస్పత్రిని, అంగన్‌వాడీ కేంద్రాన్ని అధికారులు సందర్శించారు. ప్రభుత్వ పధకాల పనితీరుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రికి వినతి
మంగళగిరి, నవంబర్ 15: పట్టణంలో నిరుపేదలు అధికంగా నివసించే రత్నాల చెరువు ప్రాంతంలో ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం 21వ వార్డు రత్నాల చెరువు ప్రాంత మున్సిపల్ కౌన్సిలర్ చిలకా బసవమ్మ స్థానిక ప్రజలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి వినతిపత్రం అందజేశారు. మూడు దశాబ్దాలుగా రత్నాల చెరువులో పేదలు ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నప్పటికీ పట్టాలు మంజూరు చేయలేదని, డ్రైనేజీ, రహదారులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి విన్నవించినట్లు బసవమ్మ తెలిపారు.

రైలు ఢీకొని 120 గొర్రెలు మృతి
శావల్యాపురం, నవంబర్ 15: మండలంలోని కనమర్లపూడి సమీపంలో గురువారం రైల్వే ట్రాక్‌ను దాటుతున్న గొర్రెల మందను రైలు ఢీకొనడంతో 120 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. కనమర్లపూడికి చెందిన గొర్రెల యజమానులు గుమ్మడి వెంకటేశ్వర్లు, గుమ్మడి పేరయ్య, కుమ్మరి శ్రీను, కుమ్మరి కొండలు తమ గొర్రెలను మేపుకునేందుకు పొలం వెళ్లే క్రమంలో రైల్వే ట్రాక్ దాటుతుండగా గుంటూరు వైపు వెళ్తున్న రైలు ఢీకొనడంతో 120 గొర్రెలు మృతి చెందాయి.