గుంటూరు

పొన్నూరు అన్న క్యాంటీన్‌ను తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొన్నూరు, డిసెంబర్ 10: పేదలకు అతి తక్కువ ఖర్చుతో భోజన వసతి కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం అన్న క్యాంటీన్లను ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. పొన్నూరులో ఏర్పాటు చేసిన క్యాంటిన్‌ను సోమవారం ఎమ్మెల్యే నరేంద్రకుమార్ తనిఖీ చేశారు. అక్కడ తయారవుతున్న ఆహారపదార్థాల నాణ్యతను పరిశీలించారు. ఇక్కడ వండుతున్న ఆహార పదార్థాలు, క్యాంటిన్ పనితీరుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వసతులు బాగున్నాయని వారు చెప్పడంతో సంతోషం వ్యక్తంచేసిన ఎమ్మెల్యే నరేంద్రకుమార్ రాష్ట్రప్రభుత్వం పేదల కోసం ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్లను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సజ్జా హేమలత, కమిషనర్ అన్నం వెంకటేశ్వర్లుతో పాటు పలువురు స్థానిక తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు.

లక్షల ఓట్ల గల్లంతుతో గుణపాఠం
గుంటూరు (పట్నంబజారు), డిసెంబర్ 10: తెలంగాణలో లక్షల ఓట్లు జాబితా నుండి గల్లంతైన ఘటనను చూసైనా ఎన్నికల కమిషన్ అధికారులు గుణపాఠం నేర్చుకోవాలని విద్యావేత్త ఇ చంద్రయ్య పేర్కొన్నారు. అరండల్‌పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో సోమవారం ఓటర్ల జాబితాపై నిర్వహించిన చర్చా కార్యక్రమానికి సంస్థ ఉపాధ్యక్షుడు పిఎస్ మూర్తి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా చంద్రయ్య మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికల ఓటర్ల జాబితాలో ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అవగతమవుతుందన్నారు. సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి మాట్లాడుతూ మన రాష్ట్రంలోనూ, తెలంగాణకు మించి ఓటర్ల జాబితాలు తప్పుల తడకగా ఉన్నాయన్నారు. ఇందుకు గుంటూరు ఈస్ట్, వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలే నిదర్శనమన్నారు. ఈ చర్చలో పి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.