గుంటూరు

ఫిబ్రవరిలో కొండవీటి ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యడ్లపాడు, డిసెంబర్ 10: చారిత్రక కొండవీటి కోటపై ఫిబ్రవరి 2,3 తేదీల్లో ఉత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సోమవారం సాయంత్రం కొండవీడు కోటపై వివిధ శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. 700 సంవత్సరాల నాటి కొండవీటి పూర్వ వైభవాన్ని పునర్నిర్మిస్తామన్నారు. కొండవీటి చారిత్రక కట్టడాలపై దేవాలయాలు, మసీదు, దర్గా, చరిత్ర ప్రసిద్ధిగాంచిన చెరువులు, వీటన్నింటినీ పునర్నిర్మిస్తామన్నారు. కొండవీడు చరిత్రను భావి తరాలకు అందజేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేయిస్తున్నారన్నారు. కొండపై గల వెదుళ్లచెరువు, ముత్యాలమ్మ చెరువు, పుట్టలమ్మ చెరువులలో ఇప్పటికీ నీరు ఇంకిపోకపోవడం చారిత్రక వింత అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొండపై 5స్టార్ రిసార్ట్స్, అంతర్జాతీయ జంతు ప్రదర్శన శాల, ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ఉన్నారని, ఈ విషయాన్ని కొండవీటి ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించే అవకాశం ఉందన్నారు. అనంతరం కొండవీడు అభివృద్ధి కమిటీ కన్వీనర్ కల్లి శివారెడ్డి కొండవీడు కట్టడాలపై తయారు చేసిన సీడీని మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యుడు పోపూరి శివరామకృష్ణ, జిల్లా కలెక్టర్ కోన శశిధర్, జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్, ఆర్కియాలజీ డిప్యూటీ డైరెక్టర్ మల్లిఖార్జునరావు, కొండవీటు అభివృద్ధి కమిటీ కన్వీనర్ కల్లి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.