గుంటూరు

నాగార్జునలో మదర్‌హాబ్ త్రీడీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున యూనివర్సిటీ, డిసెంబర్ 10: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, డసాల్ట్ సిస్టమ్స్ సంయుక్తంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోఏర్పాటు చేసిన మదర్ హాబ్ త్రిడి ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, క్రీడల శాఖా మంత్రి కొల్లు రవీంద్ర సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వర్సిటీలోని డైక్‌మెన్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి రవీంద్ర మాట్లాడుతూ త్రీడి రంగంలో అగ్రగామి సంస్థ అయిన డసాల్ట్ సిస్టమ్స్ సహకారంతో నాగార్జున వర్సిటీలో మదర్‌హాబ్‌ను ఏర్పాటు చేయటం జరిగిందని అన్నారు. ఏడాదికి సుమారు 52 ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన సుమారు 25వేల మందికి త్రీడీ రంగంలో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. రానున్న మూడేళ్లలో సుమారు 100కిపైగా కళాశాలలకు చెందిన లక్ష మంది విద్యార్థులకు ఈ రంగంలో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. డసాల్ట్ సహాకారంతో రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులకు ఆటోమోటివ్, ఎరోస్పేస్, మెరెన్ ఆఫ్ షోర్ విభాగాల్లో అత్యాధునిక సదుపాయాలతో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎపి ఎస్‌ఎస్‌డిసి సిఇఓ డాక్టర్ క్రితికాశుక్లా మాట్లాడుతూ త్రీడి రంగంలో ఏదైనా ప్రొడక్ట్‌పై అతితక్కువ కాలంలో శిక్షణ ఇవ్వటమే డసాల్ట్ త్రీడి సాఫ్ట్‌వేర్ ప్రత్యేకతని, ఈ సెంటర్ ద్వారా శిక్షణ పొందిన వారికి సర్ట్ఫికేషన్ ప్రదానం చేస్తారన్నారు. రాష్ట్ర ఎల్‌ఇటిఎఫ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి జె ఎస్‌వి ప్రసాద్ డసాల్ట్ సిస్టమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించే శిక్షణా కార్యక్రమంలో స్టార్టప్స్ ఉండేలా విద్యార్థులు శిక్షణ పొందాలన్నారు. ఈ శిక్షణ ద్వారా గుండుసూది నుండి విమానం వరకు ఏ పరికరాన్నైనా తయారు చేసే శక్తి విద్యార్థులకు వస్తుందన్నారు. అనంతరం వర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన త్రీడి సెంటర్‌ను మంత్రి కొల్లు రవీంద్ర, భారత్‌లో రాయబారి అలెగ్జాండర్ జిగ్లర్ లాంఛనంగా ప్రారంభించారు. దీంతోపాటు గోటు మార్కెట్ ఇన్ 100డేస్ పేరుతో నిర్వహించనున్న పోటీకి సంబంధించిన బ్రోచర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ వీసీ ఆచార్య రాజేంద్రప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య రోశయ్య, సెంచురియన్ వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ డిఎన్ రావు, ఎపిఎస్ ఎస్‌డిసి ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ గుజ్జుల రవి తదితరులు పాల్గొన్నారు.