గుంటూరు

శాస్ర్తియ, సనాతన సంప్రదాయాల సమ్మేళనమే వేదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), జనవరి 23: భారతదేశంలో వేదం సశాస్రీయమై, సనాతన సంప్రదాయాల సమ్మేళనంగా విరాజిల్లుతోందని తిరుపతి వేద విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ స్పష్టంచేశారు. బుధవారం నగరంలోని హిందూ కళాశాల ఏకాదండయ్య పంతులు హాలులో చెరువు సూర్యనారాయణమూర్తి, సీతారావమ్మల పేరిట వారి కుటుంబ సభ్యులు ఏర్పాటుచేసిన స్మారక పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. సభకు ప్రముఖ ఆడిటర్, హిందూ కళాశాల హైస్కూల్ కౌన్సిల్ అధ్యక్షుడు గబ్బిట శివరామ కృష్ణప్రసాద్ అధ్యక్షత వహించారు. పురస్కారాన్ని అందుకున్న ఆచార్య సన్నిధానం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ప్రపంచం నలుమూలలా భారతీయ వేదానికి ఎంతో ఖ్యాతి ఉందన్నారు. విజ్ఞాన నిధిగా కూడా మన దేశం కీర్తి పొందిందని ఆయన గుర్తుచేశారు. శ్రీవారి అనుగ్రహంతో తిరుమతిలో ఏర్పాటుచేసిన శ్రీ వెంకటేశ్వర వేద వర్శిటీ స్థాపించిన నాటి నుండి వేద విజ్ఞాన పరిరక్షణకు నిర్విరామ కృషి చేస్తుందన్నారు. వేదంలో లేనిది ఏదీ లేదన్నారు. ఈ పురస్కారం అందుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. అధ్యక్షత వహించిన శివరామ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ 2006లో తిరుపతిలో వేద వర్శిటీని ప్రభుత్వం ప్రారంభిస్తే భారతదేశంలో వేదం కోసమే ఆవిర్భవించిన మొట్టమొదటి విశ్వవిద్యాలయంగా ఈ వర్శిటీ కీర్తిపొందిందన్నారు. ముఖ్య అతిథి కడప యోగి వేమన విశ్వవిద్యాలయం విశ్రాంత వైస్ ఛాన్సలర్ ఆచార్య శ్యామ్‌సుందర్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూర విద్యాకేంద్రం డైరెక్టర్ ఆచార్య పి వరప్రసాదమూర్తి సన్నిధానం సుదర్శన శర్మ సేవలను కొనియాడారు. హిందూ కళాశాల హైస్కూల్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి జీవైఎన్ బాబు తదితరులు అభినందనలు తెలపగా, చెరువు సత్యనారాయణమూర్తి సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు భాషా శాస్తవ్రేత్తలు, పండితులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కత్తెర పురుగు నివారణకు
సత్వర సస్యరక్షణ చర్యలు చేపట్టండి
పొన్నూరు, జనవరి 23: పంటల సస్యరక్షణకు చీడపీడల బెడద నివారణకు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి అధిక దిగుబడులు సాధించాలని పొన్నూరు వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ ఎన్ ప్రభాకరరావు రైతులకు సూచించారు. వ్యవసాయ శాఖ నేతృత్వంలో పొన్నూరు మండలంలోని కట్టెంపూడి గ్రామంలో బుధవారం జరిగిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అగ్రికల్చరల్ ఏడిఎ తిరుమలాదేవి మాట్లాడుతూ మొవ్వ దశలోనే కత్తెరపురుగు గుడ్డుపెట్టకుండా వేపనూనెను పైరుపై పిచికారీ చేయాలన్నారు. పురుగు నివారణకు 50 శాతం సబ్సిడీపై మందులు అందజేసేందుకు వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యార్డు మాజీ చైర్మన్ మాదల వెంకటేశ్వరరావు, సంగం డెయిరీ డైరెక్టర్ బొర్రు రామారావు, ఎఒ జె శిరీష, ఎంపిఇఒలు ఎం అశోక్, జి మణికంఠ, రైతులు పాల్గొన్నారు.