గుంటూరు

బాబుపై గురిపెట్టిన కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 23: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఎలాగైనా అడ్డుకోవాలన్న దురుద్దేశంతో కేంద్రం నిధులు అందించకపోగా, ముఖ్యమంత్రి చంద్రబాబుపై విల్లు ఎక్కుపెట్టిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యురాలు, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి పేర్కొన్నారు. బుధవారం స్థానిక అరండల్‌పేటలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి కేడర్ వెన్నుదన్నుగా ఉంటున్నప్పటికీ నాయకులే గ్రూపులుగా ఏర్పడి ప్రతిష్టను దెబ్బతీస్తున్నారన్నారు. గ్రూపు రాజకీయాలు, విభేదాలు పక్కనబెట్టి పార్టీ విజయానికి కలిసికట్టుగా కృషిచేయాలని దిశానిర్ధేశం చేశారు. నియోజకవర్గంలో బూత్ కమిటీలను ఏకాభిప్రాయంతో నియమించుకోవాలన్నారు. చిన్న చిన్న తగాదాలు, విభేదాలను పక్కనబెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు సమష్టిగా కృషి చేయాలని కోరారు. బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ నాయకుల మధ్య విభేదాలను సరిదిద్దేందుకు తామంతా కలిసి పనిచేస్తున్నామని, ఏవైనా పార్టీ పరమైన సమస్యలు తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు అన్ని వర్గాల వారికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిందని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అందరూ సహకరించాలని కోరారు. కాగా ప్రత్తిపాడు నియోజకవర్గంతో సంబంధం లేని నేతలకు బి-్ఫరాలు ఇస్తే తామంతా కలిసి పార్టీ పటిష్టత కోసం వారిని గెలిపిస్తే చివరకు వారు పార్టీలు మారి వెళ్తున్నారని స్థానిక నాయకులు కొందరు నేతల దృష్టికి తీసుకువచ్చారు. స్థానిక నేతలను కలుపుకుని పోయే వారికి ప్రాధాన్యత కల్పించాలని కోరారు. డీసీఎంఎస్ చైర్మన్ ఇక్కుర్తి సాంబశివరావు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అగ్రి బాధితులను
మరోసారి మోసగించిన మంత్రివర్గం
గుంటూరు (పట్నంబజారు), జనవరి 23: అగ్రిగోల్డ్ బాధితులను మంత్రివర్గం మరోమారు మోసగించిందని అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. బుధవారం పట్ట్భాపురంలోని జిల్లా వైసీపీ కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో అప్పిరెడ్డి మాట్లాడుతూ అగ్రి బాధితులకు మంత్రివర్గం ప్రకటించిన 250 కోట్లు మరోపెద్ద మోసంగా అభివర్ణించారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారమే 5 నుండి 10 వేలలోపు డిపాజిట్‌లు చేసిన వారికి 363 కోట్లు, 20 వేలలోపు డిపాజిట్ వారికి 1,182 కోట్లు అవసరమన్నారు. 250 కోట్లు ఎలా సర్దుబాటు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు ప్రభుత్వ జాబితాలో తమ పేరు ఉందో లేదో అన్న అనుమానం బాధితుల్లో నెలకొందన్నారు. గత ఏడాది డిసెంబర్ 29న ప్రభుత్వ ప్రతినిధిగా కుటుంబరావు 5 నుండి 10 వేలలోపు డిపాజిట్‌లకు సత్వర న్యాయం చేస్తామని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. యాజమాన్యం కోర్టుకు చూపిన ఆస్తులను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని నిధులు విడుదల చేసేందుకు వీలుగా కోర్టులో అఫిడవిట్ వేస్తామని చెప్పి, నేటికీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో ఉయ్యూరు అప్పిరెడ్డి, పసుపులేటి వెంకట్రావ్, అంగిరేకుల ఆదిశేషు, గాదె శివరామకృష్ణారెడ్డి, పసుపులేటి రమణ తదితరులు పాల్గొన్నారు.