గుంటూరు

తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలను పరిశీలీస్తున్న కేంద్ర బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, జనవరి 23: జాతీయ క్వాలిటీ ఎష్యూరెన్స్ స్టాండర్డ్స్ బృందం బుధవారం గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ వైద్యశాలను పరిశీలించారు. ముగ్గురు సభ్యులతో వచ్చిన బృందాన్ని వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సనత్‌కుమారి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం వైద్యశాలలో రోగులకు అందుతున్న వైద్యసేవలకు సబందించిన వివరాలతో కూడిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ను బృందానికి వివరించారు. ఈసందర్భంగా కేంద్ర బృందం సభ్యులు డాక్టర్ మనోజ్, డాక్టర్ అగర్వాల్, డాక్టర్ అనిల్‌లు వైద్యశాల అంతర, బాహ్య ప్రదేశాలు, తల్లీపిల్లల వార్డులు, జనరల్ వార్డులు, శవాగారం తదితరాలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో సభ్యుల బృందం మాట్లాడుతూ వైద్యశాల ఆవరణం ఆహ్లాదకరంగా, పరిశుభ్రంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. వైద్యశాలలోని ప్రతీవిభాగంలో వైద్యుల సేవలు జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయోలేదో తెలుసుకుంటామని దాదాపు మూడు రోజులపాటు వైద్యశాలలోనే ఉండి వివరాలు సేకరించనున్నట్లు తెలిపారు. అనంతరం నివేదికను తయారుచేసి కేంద్రప్రభుత్వానికి సమర్పిస్తామని పేర్కొన్నారు. ఈ నివేదిక ప్రకారం జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల ఉంటే ఎన్‌క్యూఏఎస్ సర్ట్ఫికెట్‌ను వైద్యశాలకు అందిస్తారని తెలిపారు. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సనత్‌కుమారి మాట్లాడుతూ తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో అందుతున్న వైద్యసేవలు దాదాపు జాతీయ ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయని, అయితే ఏమైనా లోటుపాటులు ఉంటే కేంద్ర బృందం సభ్యులు సూచనలు అందించిన వెంటనే వాటిని అమలుచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మొదటి రోజు పర్యటనలో భాగంగా కేంద్ర బృందం నూతనంగా ప్రారంభమైన తల్లీపిల్లల వైద్యశాలలో వైద్యం అందస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. వైద్యశాలలో గర్నిణులకు అందుకున్న వైద్యం, ప్రసవం అనంతరం అందిస్తున్న సేవలు, బిడ్డకు రక్షణ కల్పించే విషయంలో వైద్యశాల తీసుకుంటున్న చర్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో స్టేట్ క్యాలిటీ అధికారి డాక్టర్ సుహాసినీ, ఆర్‌ఎం ఓ సురేష్, డాక్టర్స్ రవి, హనుమంతరావు, రాంప్రసాద్, మాధవి, శ్రీనివాసరావు, హదస్సా, రమణారావు, ప్రేమ్‌కుమార్, శ్రీనివాస్, వెంకటేశ్వరావు, పుల్లారావు, క్యాలిటీ మేనేజర్లు వాసు, వాసురాజు, వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు.

రూ. 1.90 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
నరసరావుపేట, జనవరి 23: పట్టణంలోని తొమ్మిది, 25వార్డుల్లో 80 లక్షల రూపాయల విలువైన అంతర్గత రోడ్లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను బుధవారం స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు నిర్వహించారు. అదే విధంగా రావిపాడు రోడ్డులో1.10 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి మున్సిపల్ పార్క్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్క్‌ను ఆయన పరిశీలించారు. పూలమొక్కలు, సువాసన వెదజల్లే మొక్కలు ఏర్పాటు చేయాలని కాంట్రాక్టర్‌ను, మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించే పార్కుల్లోకి చిల్లర పనులు చేయకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు. అదే విధంగా పార్క్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని స్పీకర్ ఆదేశించారు. ఎన్‌జీవో కాలనీలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించిన అనంతరం అక్కడి మహిళలతో మాట్లాడి, ఆ ప్రాంత సమస్యలను తెలుసుకున్నారు. అదే విధంగా తొమ్మిదో వార్డులో నూతనంగా నిర్మించనున్న సీసీరోడ్లకు శంకుస్థాపనలు చేశారు. సీసీ రోడ్లకు డ్రైన్లు ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో పట్టణంలో ఎన్నడూ జరగనంత పనులు జరిగాయని అన్నారు. అదే విధంగా పట్టణంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసిన మున్సిపల్ కమిషనర్ భానూప్రతాప్‌ను అభినందించారు. ప్రజలకు కావాల్సిన అన్ని వౌలిక సదుపాయాలను పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తా, వైస్ చైర్మన్ షేక్ మీరావలి, మున్సిపల్ కమిషనర్ భానూప్రతాప్, డీఈ శివరామకృష్ణ, ఏఈలు రఫీ, ప్రవీణ్, టీపీవో సాంబయ్య, కొండ్రగుంట కృష్ణ, పట్టణ అధ్యక్షురాలు ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.