గుంటూరు

రూ. 117 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, ఫిబ్రవరి 13: పట్టణంలో 117 కోట్ల 44 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రాజీవ్ సెంటర్లో బుధవారం మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి శంకుస్థాపన గావించారు. ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇనె్వస్ట్‌మెంట్ బ్యాంక్ (ఎఐఐబీ) నిధులు 85.30 కోట్లతో శాశ్వత మంచినీటి సరఫరా ఏర్పాటుకు, క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇనె్వస్ట్‌మెంట్ ప్లాన్ (పీఐఐపీ) నిధులు 32.14 కోట్ల రూపాయలతో సీసీరోడ్లు, కాలువలు, తాగునీరు, మురికినీరు శుద్ధి చేసే ప్లాంటు నిర్మాణం, శ్మశాన వాటికలు, పార్కులు అభివృద్ధి, మెరుగుపరిచేందుకు సంబంధించి చైర్మన్ ఒకేచోట శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. చైర్మన్ చిరంజీవి మాట్లాడుతూ గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా పట్టణంలో కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు నిర్వహించడం జరిగిందని, శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులను ఇంజినీరింగ్ అధికారులు త్వరితగతిన నాణ్యతగా పూర్తి చేయాలని కోరారు. కౌన్సిల్ సభ్యులు మునగపాటి వెంకటేశ్వరరావు, నందం బ్రహ్మేశ్వరరావు, వంగర శకుంతల, చిలకా బసవమ్మ, గోలి నాగశ్రీనివాస్, రంగిశెట్టి నరేంద్ర, జంజనం శ్రీనివాస్, ఉయ్యాల సత్యనారాయణ, ఉడతా శ్రీను, మండ్రు రాము, మద్దిరాల రమేష్, డీఈఈ పీ ఏడుకొండలు, ఏఈ ఎం వెంకట్రామన్, మార్కెట్‌యార్డు చైర్మన్ వల్లభనేని సాయిప్రసాద్, పీ ప్రేమ్‌కుమార్, టీ బాపనయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆలయ పాలకమండలి పదవీ స్వీకారం
పొన్నూరు, ఫిబ్రవరి 13: పట్టణంలోని తోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి ప్రభుత్వం నియమంచిన నూతన పాలకమండలి బుధవారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. రాతంశెట్టి బాల సుందరరావు, తన్నీరు రామారావు, సాధు వెంకట పూర్ణాకుమార్, యర్రబోయిన యానాదిరావు, కూరపాటి అంకమ్మరావు, చదలవాడ సుజాత, వడ్లమూడి అమరనాధ్ శర్మలచే దేవాదాయ ఇన్స్‌పెక్టర్ ఎస్ కుమారబాబు, ఇఒఎం శ్రీనివాసరావు ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల సాంబశివరావు, స్థానిక టీడీపీ నాయకులు శెట్టి లింగేశ్వరరావు, టి లక్ష్మీనారాయణ చౌదరి, ఆరె ప్రసాద్, వెంకటేశ్వర్లు, తోట ప్రసాద్, జిఎంఎస్ గుప్తా హాజరయ్యారు.

అమరావతిలో అన్న క్యాంటీన్ నిర్మాణానికి శంకుస్థాపన
అమరావతి, ఫిబ్రవరి 13: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న అమరావతిలో అన్న క్యాంటీన్ నిర్మాణానికి బుధవారం పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్ శంకుస్థాపన గావించారు. స్థానిక కూరగాయల మార్కెట్ సమీపంలో నిర్మించ తలపెట్టిన అన్న క్యాంటిన్ అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని శ్రీ్ధర్ తెలిపారు. ఆయన వెంట టీడీపీ నాయకులు మల్లాది విష్ణువర్ధన్, సిహెచ్ శౌరి షేక్ జాని, షేక్ అమాన్, పెనుముచ్చు రామకృష్ణ, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ఆర్‌జేడీ కార్యాలయ పనులు ప్రారంభం
గుంటూరు, ఫిబ్రవరి 13: రాష్ట్రంలోనే ప్రప్రథమంగా గుంటూరులో ప్రాంతీయ సంయుక్త సంచాలకుల కార్యాలయం (ఆర్‌జెడి) పనులు ప్రారంభించడం హర్షణీయమని ఆర్‌జెడి శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ఆర్‌జెడి నూతన భవనానికి శంకుస్థాపన చేసి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖ ద్వారా సుమారు 63 లక్షల రూపాయల అంచనా వ్యయంతో భవన నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఉపాధ్యాయులు, సందర్శకులకు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం, ఆర్‌జెడి కార్యాలయం ఒకేచోట ఉండటం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారిణి ఎస్ గంగాభవాని మాట్లాడుతూ సమస్యల పరిష్కారంలో అందరికీ చేదోడు వాదోడుగా ఈ రెండు కార్యాలయాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో సర్వశిక్షా అభియాన్ డిప్యూటీ డైరెక్టర్ పి రమేష్, ఆర్‌జెడి కార్యాలయ ఎడిలు రాంబాబు, సుధ, ఉర్ధూ పాఠశాల ఉప తనిఖీ అధికారి ఎస్‌కె ఎండి ఖాసిం, ఎంఇఒ అబ్దుల్ ఖుద్దూస్ తదితరులు పాల్గొన్నారు.