గుంటూరు

1 నుండి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 19: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలో మార్చి 1 నుండి 7వ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్ పిలుపునిచ్చారు. మంగళవారం ఎమ్మెల్యే తన ఛాంబర్‌లో శివరాత్రి ఉత్సవాలకు సంబంధించిన గోడ, ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీ్ధర్ మాట్లాడుతూ శివరాత్రి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుండి సుమారు 2 లక్షల మందికి పైగా భక్తులు విచ్చేస్తారని, అందుకు తగ్గట్లు విస్తృత స్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారి నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి, ట్రస్ట్‌బోర్డు సభ్యులు విన్నకోట గోపాలరావు, పీసపాటి నాగేశ్వరశర్మ, శ్రీనివాసయాదవ్, నేరెళ్ల హనుమంతరావు, మల్లాది విష్ణువర్ధన్, సిహెచ్ శౌరి, కోవూరి సునీల్, శ్రీకాంత్, వేగుంట రాణి తదితరులు పాల్గొన్నారు.

దళితుల సమస్యలను పరిష్కరించాలి
గుంటూరు (పట్నంబజారు), ఫిబ్రవరి 19: రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం మాలమహానాడు నేతలు మంత్రి ఆనందబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అరుణ్‌కుమార్ మాట్లాడుతూ రిజర్వ్‌డ్ స్థానాల్లో దళితులపై అగ్రవర్ణాల పెత్తనం ఎక్కువైందన్నారు. మాలలకు ఏ పార్టీ అయితే అధికంగా సీట్లు కేటాయిస్తుందో వారికే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. సమస్యలపై స్పందించిన మంత్రి ఆనందబాబు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో దళిత యువసేన రాష్ట్ర అధ్యక్షుడు దార అంబేద్కర్, నాయకులు సీలా రంజన్‌బాబు, చెల్లి సుభాషణ్‌కుమార్, కట్టా మహేష్, వేణు తదితరులు పాల్గొన్నారు.

నవరత్నాలను విద్యార్థులకు వివరించాలి
గుంటూరు (పట్నంబజారు), ఫిబ్రవరి 19: దివంగత ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని వైఎస్‌ఆర్ సీపీ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పట్ట్భాపురంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యాన జరిగిన ఆత్మీయ సమావేశానికి పానుగంటి చైతన్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ విద్యార్థి విభాగం విద్య కోసం జగన్ చేపట్టిన నవరత్నాల పథకాలను విద్యార్థులకు వివరించాలన్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్సుమెంటు బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు విద్యను అర్ధాంతరంగా ముగిస్తున్నారన్నారు. గతంలో వైఎస్ ఫీజురీయింబర్సుమెంటు కోసం 35 వేల రూపాయలు కేటాయింపులు చేశారని, అదేవిధానం నేటికీ కొనసాగుతుందన్నారు. ప్రత్తిపాడు, గుంటూరు పశ్చిమ, తాడికొండ నియోజకవర్గాల సమన్వయకర్తలు మేకతోటి సుచరిత, చంద్రగిరి ఏసురత్నం, డాక్టర్ ఉండవల్లి శ్రీదేవిలు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో పాదర్తి రమేష్‌గాంధీ, వైసీపీ నాయకులు ఉమామహేశ్వరరెడ్డి, విఠల్, వినోద్, జగదీష్, వలి, బాజి, అజయ్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.