గుంటూరు

పోలీసుశాఖపై విషప్రచారం చేస్తే సమాజం నిర్వీర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 19: పోలీసుశాఖపై విషప్రచారం చేస్తే సమాజం నిర్వీర్యమవుతుందని రూరల్ ఎస్పీ రాజశేఖరబాబు అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సన్నిహితంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొండవీడు ఉత్సవాల సందర్భంగా కోటయ్య అనే రైతు ఆత్మహత్యకు పాల్పడటం, అతనిని పోలీసులే కొట్టి చంపారనే ప్రచారం విస్తృతంగా సాగుతుందని, కానీ వాస్తవంగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజాలు లేవన్నారు. కోటయ్య పొలం నాశనం చేసి హెలిప్యాడ్ ప్రదేశం ఏర్పాటు చేయలేదని సభా స్థలానికి ధూరంగా కోటయ్య పొలం ఉందన్నారు. కోటయ్య పొలంలో పురుగు మందు తాగి పడి ఉండటంతో తమ సిబ్బందే గమనించి అతనిని రక్షించే ప్రయత్నం చేశారన్నారు. అయినా పోలీసుశాఖపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ఘటనపై పూర్తిస్థాయిలో కోటయ్య బంధువులు తెలిపిన ప్రకారమే విచారణ సాగుతుందుని, కేసును కూడా పోలీసులు కొట్టడం వల్లే చనిపోయాడని నమోదు చేశామన్నారు. నరసరావుపేట డిఎస్పీతో కేసు విచారణ సాగుతుందన్నారు. రైతు కోటయ్య పొలాన్ని పోలీసులు నాశనం చేయడం, కొట్టడం అనేవి కేవలం కొంతమంది చేస్తున్న దుష్ప్రచారమే అన్నారు. గతంతో కూడా ప్రజలతో అమర్యాదగా ప్రవర్తించిన వారిపై తాము కఠిన చర్యలు తీసుకున్న విషయం కూడా ప్రజలు గుర్తించాలన్నారు. తమశాఖలో తప్పు చేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదన్నారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు సాగుతుందని నిజానిజాలు త్వరలోనే బయటకు వస్తాయని ఎస్‌పి విజయారావు తెలిపారు.

మంగళగిరిలో వీవీప్యాట్‌లపై అవగాహన
మంగళగిరి, ఫిబ్రవరి 19: ఓటు హక్కు వినియోగంలో రాజకీయ పార్టీలకు, ఓటర్లుకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మంగళవారం స్థానిక మండల రెవిన్యూ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులకు వీవీప్యాట్‌లపై అవగాహన కల్పించారు. ఓటరు వేసిన ఓటు హక్కును నిర్ధారించేందుకు ప్రత్యేకంగా వీవీప్యాట్ (ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్) ను ఈవీఎంకు అనుసంధానం చేసి చూపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు లేవనెత్తిన సందేహాలను తహశీల్దార్ జీవీ రాంప్రసాద్, ఎఎస్‌ఓ బాలనాగేశ్వరరావులు నివృత్తి చేశారు. మున్సిపల్ డీఈఈ పీ ఏడుకొండలు, మార్కెట్‌యార్డు చైర్మన్ వల్లభనేని సాయిప్రసాద్, టీడీపీ, వైసీపీ, సీపీఎం, సీపీఐ ప్రతినిధులు పాల్గొన్నారు.

విద్యుదాఘాతంతో చిన్నారి మృతి
అచ్చంపేట, ఫిబ్రవరి 19: మండల కేంద్రమైన అచ్చంపేటలో విద్యుత్ షాక్‌కు గురై ఏడు నెలల చిన్నారి వల్లెం చెన్నకేశవులు మృతిచెందిన ఘటన మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన వల్లెం కోటేశ్వరరావు, మల్లేశ్వరి దంపతులు పోలీసుస్టేషన్ రోడ్డులో చిన్న హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈక్రమంలో వారు మంగళవారం ఉదయం గ్రైండర్‌లో పప్పువేసి స్విచ్ ఆన్ చేశారు. ఈ సమయంలో చిన్నారి గ్రైండర్‌ను పట్టుకోవడంతో గ్రైండర్‌కు విద్యుత్ సరఫరా అయి షాక్‌కు గురయ్యాడు. బాలుడిని ఆసుపత్రికి తీసుకువస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. ఈ సంఘటనతో తల్లిదండ్రులు, బంధువులు, ఇరుగుపొరుగు వారు శోకసంద్రంలో మునిగారు.

వైభవంగా కొండగురునాథస్వామి తిరునాళ్ల
నూజెండ్ల, ఫిబ్రవరి 19: రవ్వారం శ్రీ కొండగురునాథుని స్వామి తిరునాళ్లు మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. సోమవారం మెట్ల పూజతో ప్రారంభమైన తిరునాళ్లకు వేలాదిమంది పాల్గొన్నారు. కొండపై వేంచేసి యున్న సంతాన లింగేశ్వరుడు, దత్తాత్రేయుడు, కాలభైరవుడు, కుమార స్వామి విగ్రహాలకు పూజలు చేశారు. మహిళలు పొంగళ్లు పొంగించి నైవేద్యాన్ని సమర్పించారు. సంతాన లింగేశ్వర పొత్రాన్ని తిప్పి మొక్కు తీర్చుకున్నారు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ బొల్లా బ్రహ్మనాయుడు, డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావులు పూజలు చేశారు. కాకతీయ సత్రంలో ఏర్పాటు చేసిన అన్నదానాన్ని కార్యక్రమాన్ని ప్రారంభించారు. 11విద్యుత్ ప్రభలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తులకు పలు పార్టీ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు అన్నదానం, పలిహోరా, మంచినీళ్ల పాకెట్స్, మజ్జిగ ప్యాకెట్లను ఏర్పాటు చేశారు. వినుకొండ డిపో, అద్దంకి డిపో నుండి ఆర్టీసీ సర్వీస్‌లు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వినుకొండ రూరల్ సీఐ సురేంద్రబాబు, ఐనవోలు ఎస్‌ఐ వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.