గుంటూరు

రైతు కోటయ్య మృతిపై అనుమానాలున్నాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిలకలూరిపేట, ఫిబ్రవరి 19: యడ్లపాడు మండలం, కొత్తపాలెం గ్రామానికి చెందిన రైతు పిట్టల కోటయ్య మృతిపట్ల పలు అనుమానాలు ఉన్నాయని వైఎస్‌ఆర్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజని ఆరోపించారు. మంగళవారం చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి సోమవారం మృతిచెందిన కోటయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తీసుకువచ్చారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్, సమన్వయకర్త విడదల రజని, పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వాసుపత్రి వద్దకు చేరుకున్నారు. కోటయ్య మృతికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని, కోటయ్య కుమారుడికి ఉద్యోగం, 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని మర్రి రాజశేఖర్ డిమాండ్ చేశారు. విడదల రజని మాట్లాడుతూ ఒక సామాన్యమైన రైతును పోలీసులచే ఇబ్బందులకు గురిచేయించి మానసిక క్షోభకు గురిచేయడం హత్యతో సమానమని, ఒక కుటుంబం పెద్ద దిక్కుని కోల్పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పి బాలాజి, సీపీఎం పశ్చిమ జిల్లా కార్యదర్శి చలమయ్య, సీపీఐ పేట ఏరియా కార్యదర్శి సిఆర్ మోహన్‌లు ప్రభుత్వాసుపత్రికి వచ్చి కోటయ్యకు నివాళులర్పించరు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ మృతుని కుటుంబానికి ఒక ఎకరం భూమి, ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని, ఇందుకు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మృతుడు కోటయ్య కుమారుడు ఆంజనేయులు తన తండ్రి మృతి పట్ల అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని రూరల్ సిఐ విజయబాబు తెలిపారు. కాగా కోటయ్య మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం స్వగ్రామమైన కొత్తపాలెంకు పోలీసులు తరలించారు. ఎటువంటి అవాంచనీయమైన సంఘటనలు జరగకుండా పట్టణ, రూరల్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

కృష్ణానదిలో శ్రీ పానకాల లక్ష్మీనరసింహ స్వామి తెప్పోత్సవం
తాడేపల్లి, ఫిబ్రవరి 19: కృష్ణానదిలో మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహ స్వామి తెప్పోత్సవం మంగళవారం సాయంత్రం వైభవోపేతంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేతుడైన నరసింహస్వామి ఉదయం సీతానగరం ఆంజనేయ స్వామి ఆలయంలో విడిది చేసిన అనంతరం స్వామివారు సతీసమేతంగా కృష్ణానదిలో విహరించారు. వేదపండితులు, అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతానగరంలోని పడవల రేవు నుంచి విజయవాడ దుర్గా ఘాట్ వరకు తెప్పోత్సవం కనుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ చుండూరి రామాంజనేయ ప్రసాద్, అర్చక డైరెక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి, మంగళాద్రి ఆలయ ఇఒ మండేపూడి పానకాలరావు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.