గుంటూరు

ఓటరు నమోదుపై ప్రజలకు అవగాహన కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 21: ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కును వినియోగించుకునేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది సూచించారు. గురువారం అమరావతి నుండి ఆయా జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో భాగంగా గుంటూరు నుండి కలెక్టర్ కోన శశిధర్, డిఆర్‌ఒ శ్రీలత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి ద్వివేది మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉన్నారా, లేదా అని క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని, అర్హులందరికీ ఓటు హక్కును కల్పించాలని సూచించారు. ఓటరు జాబితాలో ఏమైనా తపొప్పులు ఉంటే వాటిని ఫారం-7 ద్వారా శుక్రవారంలోగా అందజేయాలన్నారు. జిల్లా కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ జిల్లాలో డెమోగ్రాఫికలి, సిమిలర్ 19,839 ఓటర్లు ఉన్నాయని, ఎలక్షన్ కమిషన్ నిర్ధేశించిన మేరకు వాటిని తొలగించేందుకు అవసరమైన చర్యలు ఇప్పటికే చేపట్టడం జరిగిందని వివరించారు. ఈనెల 22వ తేదీలోగా ఎలక్షన్ కమిషన్‌కు ఓటర్ల జాబితా గురించి నివేదిక పంపుతామని కలెక్టర్ తెలిపారు.

రెల్లి కులస్తులకు అండగా జనసేన
* జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్
గుంటూరు, ఫిబ్రవరి 21: ప్రజారోగ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న రెల్లి కులస్తులకు అండగా జనసేన పార్టీ ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ అన్నారు. గురువారం అరండల్‌పేటలోని పార్టీ కార్యాలయంలో 26వ డివిజన్ కెవీపీ కాలనీకి చెందిన రెల్లి కులస్తులు చంద్రశేఖర్ సమక్షంలో జనసైన్యంలో కలిశారు. ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ సమాజంలో నిరాదరణకు గురైన రెల్లి కులస్తుల సమస్యలపై తమ అధినేత పవన్ చేసిన రాష్టవ్య్రాప్త పోరాటాల ఫలితంగా జీవో 279 రద్దైందన్నారు. సమాన పనికి సమాన వేతనం దక్కేలా జనసేన పార్టీ పోరాడిందని, రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు రెల్లిలను ఓటుబ్యాంకుగా మాత్రమే వాడుకుంటూ వారి సంక్షేమాన్ని విస్మరించారన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా వీరి జీవన ప్రమాణాల్లో మార్పులు రావడం లేదన్నారు. సమాజంలో పారిశుద్ధ్య పనులు చేసేందుకు ఎవరూ ఇష్టపడరని, అటువంటిది ప్రజల ఆరోగ్య పరిరక్షణకు తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా సమాజహితం కోసం వీరు పనిచేస్తున్నారన్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక రెల్లిలకు ఉద్యోగ, ఆరోగ్య భద్రతతో పాటు పక్కా నివాస గృహాలు కల్పించేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. రెల్లి సంఘ నాయకులు సోమి ఉదయకుమార్ మాట్లాడుతూ సమాజంలో ఎటువంటి గుర్తింపులేని తమ వర్గాన్ని పవన్‌కళ్యాణ్ బహిరంగ సభలో తాను రెల్లి కులానికి చెందినవాడినని ప్రకటించడం తమ జాతికి దక్కిన గౌరవంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్‌లు మాదా రాధా, సయ్యద్ బాబు, నేతలు సాంబశివరావు, డాక్టర్ సతీష్, సోమి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.