గుంటూరు

మాతృభాషాభివృద్ధికి సాంకేతిక పరిజ్ఞానం దోహదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), ఫిబ్రవరి 21: దినదినాభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా మన తీయనైన తెలుగుభాషాభివృద్ధి చేసుకోవచ్చని నిఘంటువు నిర్మాతగా ఇటీవల కాలంలో పేరుపొందిన పెద్ది సాంబశివరావు సూచించారు. గురువారం నగరంలోని హిందూ కళాశాలలో అక్షరభాషా సంగమం ఆధ్వర్యాన మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యఅతిథి, ప్రధానవక్త సాంబశివరావు మాట్లాడుతూ ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎన్నో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తోందని, అవసరమైన మేరకు ఈ విజ్ఞానాన్ని వినియోగించుకుని మన మాతృభాష అభివృద్ధికి దోహదం చేసుకోవచ్చన్నారు. మరోవక్త, సాహితీవేత్త డాక్టర్ చింతపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరం మాతృభాష గురించి మాట్లాడుతున్నామని, ఎవరికి వారు స్వచ్ఛందంగా దైనందిన జీవితంలో తల్లిలాంటి మన తెలుగు భాష అభివృద్ధికి ఎంతవరకు కృషిచేస్తున్నామో ఆత్మావలోకం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ కళాశాల వివిధ శాఖాధిపతులు డాక్టర్ డిఎన్ దీక్షిత్, డాక్టర్ విజయరత్న కుమార్, అరుణ, అధ్యాపకుడు నందవనం శ్రీనివాస్, తెలుగుశాఖ అధ్యక్షుడు డాక్టర్ వై మల్లిఖార్జునరావు, విద్యార్థులు పాల్గొన్నారు.
అన్నమయ్య కళావేదికపై...
కాగా బృందావన గార్డెన్స్ అన్నమయ్య కళావేదికపై మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకుని భావకవితా మహతి వారణాశి వెంకటరావు గేయకవితా వైభవాన్ని నిర్వహించారు. సంగీత సాహిత్య సమాలోచన కార్యక్రమంలో పలువురు సాహిత్యాభిమానులు, భాషాప్రియులు పాల్గొన్నారు.