గుంటూరు

సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేయాలంటూ టీడీపీ ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొన్నూరు, ఫిబ్రవరి 21: తప్పుడు పద్ధతిలో ఓట్లను తొలగించిన విషయమై పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ కేసులోని వైసీపీకి చెందిన నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పొన్నూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు, కార్యకర్తల బృందం గురువారం ఉదయం ధర్నా జరిపారు. నియోజకవర్గంలోని కొందరు విఆర్‌ఒలను లోబర్చుకుని సాంకేతిక పరిజ్ఞానంతో 5 వేల ఓట్లను తొలగించిన వైసీపీకి చెందిన కొందరు నేతలపై పోలీసుస్టేషన్‌పై కేసు నమోదైనా వారిని ఇప్పటికీ అరెస్ట్ చేయకపోవడం పట్ల తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎఎంసి చైర్మన్ ప్రభాకరరావు, మాజీ చైర్మన్ మాదల వెంకటేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల సాంబశివరావు, పట్టణ, మండల టీడీపీ అధ్యక్షుడు అహ్మద్ ఖాన్, బొర్రు రామారావు, తదితర పార్టీ నేతల నాయకత్వంలో జరిగిన ధర్నాలో వందలాది మంది టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ఓట్ల తొలగింపు కేసులోని సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేయాలని కోరుతూ నియోజకవర్గ ఎన్నికల అధికారి పి కొండయ్య, తహశీల్దార్ రమణారావు, సిఐ నాగేశ్వరరావులకు వినతిపత్రం అందజేశారు.