గుంటూరు

శివరాత్రికి విస్తృత ఏర్పాట్లు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 27: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలో మార్చి 1 నుండి 7వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లోఅన్నిశాఖల అధికారులు విస్తృతస్థాయిలో ఏర్పాట్లు చేసి ఉత్సవాలు విజయవంతం అయ్యేలా కృషిచేయాలని గుంటూరు ఆర్డీవో వీరబ్రహ్మం కోరారు. బుధవారం స్థానిక అమరేశ్వరాలయంలో జరిగిన మహాశివరాత్రి ఏర్పాట్ల సమీక్షా సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి ప్రసంగించారు. శాఖలవారీగా చేస్తున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఉత్సవాల్లో ప్రధానంగా దేవాదాయశాఖ, పోలీసు, గ్రామ పంచాయతీవారు అప్రమత్తంగా ఉండి భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా సుమారు 2 లక్షల మందికి పైగా భక్తులు వస్తారన్నారు. కృష్ణానదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉన్న దృష్ట్యా భక్తులకు స్నానాలు ఆచరించేందుకు స్నానఘాట్‌లో తుంపర్ల స్నానాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఆలయ లోపల, కృష్ణానది ఒడ్డున, మెయిన్‌బజారులో విస్తృత బందోబస్తు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో తహశీల్దార్ వి లావణ్య, ఎండీవో బ్ర హ్మేశ్వరరావు, అమరావతి పంచాయతీ కార్యదర్శి ఎ మోహన్‌చంద్, అమరావతి సిఐ కె ప్రభాకర్, దేవాదాయ శాఖ ఇన్స్‌పెక్టర్ శివప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కార్మికుల సమస్యల పరిష్కారమే టీఎన్‌టీయూసీ ధ్యేయం
గుంటూరు, ఫిబ్రవరి 27: రాష్ట్రంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు బి నరేష్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక అరండల్‌పేటలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో టిఎన్‌టియుసి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘ నూతన అధ్యక్షుడుగా నియమితులైన నరేష్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆటో, అంగన్‌వాడీ, భవన నిర్మాణ, ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల గురించి వివరించారు. రాష్ట్రంలో టీఎన్‌టీయూసీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో ఆటోడ్రైవర్ల సంక్షేమం కోసం కార్యక్రమాలు అమలు చేయాలని, డ్రైవర్ల సాధికార సంస్థ ఏర్పాటు పట్ల ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానించారు. అలాగే అంగన్‌వాడీ, ఆశావర్కర్లు, హోంగార్డులు, కాంట్రాక్టు వర్కర్లు, అవుట్‌సోర్సింగ్ వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం పట్ల సమావేశం హర్షం వ్యక్తంచేసింది. ఈ సమావేశంలో విజయవాడ అర్బన్ కార్యదర్శి కొమ్మారెడ్డి పట్ట్భారామ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంటుపల్లి శేషగిరిరావు, బిల్లా రామ్మోహనకుమార్, గుంటూరు జిల్లా అధ్యక్షుడు నారా జోషి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి గల్లా రాము తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల్లో బూత్ కన్వీనర్ల పాత్ర కీలకం
అచ్చంపేట, ఫిబ్రవరి 27: రాబోయే ఎన్నికలలో పార్టీ బూత్ కన్వీనర్‌లు కీలకపాత్ర పోషించి పార్టీ విజయానికి కృషిచేయాలని ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన బూత్ కన్వీనర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ ఆదేశాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కన్వీనర్‌లు శక్తివంచన లేకుండా విజయానికై ముందుకు నడవాలన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా పర్యవేక్షణలో అందరూ పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ ఆర్‌పి రమేష్, ఎస్ నాగేశ్వరరావు, మద్దిరాల గంగాధర్, కిలారి రాజన్‌బాబు, నల్లమేకల వెంకటేశ్వరరావు, రాయిడి విశే్వశ్వరరావు, ఆశీర్వాదం, అరుణ్, కృష్ణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇలా ఉండగా మండలంలోని తాళ్లచెరువు, మాదిపాడు గ్రామాల నుండి భారీగా తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ కార్యకర్తలు బుధవారం చేరారు. తాళ్లచెరువు నుండి 30 కుటుంబాలు, మాదిపాడు ఎస్సీ మహిళలు మరో 11 మంది ఎమ్మెల్యే శ్రీ్ధర్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బత్తుల శ్రీనివాసరావు, థామస్, సందెపోగు శ్రీనివాసరావు, రేపూడి సాగర్ తదితరులు పాల్గొన్నారు.