గుంటూరు

ఇడి ఆయిల్ ట్యాంకర్ బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజుపాలెం, జూన్ 14: గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సమీపంలోని బ్రాహ్మణపల్లి బైపాస్ రోడ్డులో మంగళవారం ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడింది. డీజిల్, పెట్రోల్‌లో ముడి సరుకుగా ఉపయోగించే ఇడి ఆయిల్‌తో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం జెమిని ఆయిల్ ఫ్యాక్టరీ నుండి బయల్దేరి హైదరాబాద్ వెళ్తున్న ఎపి 26ఇటి4569 నెంబర్ గల ట్యాంకర్‌కు బ్రాహ్మణపల్లి బైపాస్‌రోడ్డుపై గేదె అడ్డురావడంతో ఒక్కసారిగా డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో అదుపుతప్పి ట్యాంకర్ బోల్తాపడటంతో ట్యాంకర్ సీలు విరిగిపడి ఆయిల్ ధారగా పక్కనే ఉన్న కాల్వలోకి ప్రవహించింది. సమాచారం తెలుసుకున్న చుట్టుపక్కల స్థానికులు సందట్లో సడేమియా చందాన ఉరుకులు పరుగులపై వచ్చి క్యాన్‌లు, బిందెలు, చెంబులతో సైతం అందిన మేరకు నింపుకుని వెళ్లారు. అయితే అది వంటనూనె కాదని, దానిని వినియోగించరాదని క్లీనర్ వారిస్తున్నా వారెవ్వరూ పట్టించుకోలేదు. ప్రమాదంలో గాయాలపాలైన లారీ డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం 108 వాహనంలో పిడుగురాళ్ల ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పిడుగురాళ్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికులను చెదరగొట్టారు. బోల్తాపడిన ట్యాంకర్‌ను క్రేన్ సాయంతో వెలికితీశారు.