గుంటూరు

రూ.3.83 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజుపాలెం, జూన్ 14: రూ. 3.83 కోట్ల రూపాయల వివిధ అభివృద్ధి పనులకు మంగళవారం స్పీకర్ కోడెల శివప్రసాదరావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మండలంలోని చౌటపాపాయపాలెం, రాజుపాలెం, రెడ్డిగూడెం తదితర గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనుల కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. తొలుత చౌటపాపాయపాలెంలో 1.33 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు ఆర్‌ఆర్ వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ గతంలో ఇక్కడ సభ ఏర్పాటుచేస్తే నాతో ఘర్షణ పడ్డారని, అలాంటి అంశాలకు తావివ్వకుండా మీరు పనులు వద్దనే వరకు అభివృద్ధి పనులు చేపడుతూనే ఉంటానని అన్నారు. సిసి రోడ్లు, డంపింగ్‌యార్డులు, గ్రంథాలయాలు, కమ్యూనిటీ హాళ్లు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణానికి నిధులు వినియోగించుకోవాల్సిందిగా కోరారు. ఈ ఏడాది వర్షాలు సరిగా లేకపోవడంతో నీటి ఎద్దడి ఎదురైందని, ఈ సమస్య ముందు ముందు లేకుండా ప్రతి ఇంటా ఇంకుడుగుంత ఏర్పాటు చేసుకోవాలన్నారు. మా ఇంట్లో కూడా మూడు ఇంకుడుగుంతలు తీశానన్నారు. రాజుపాలెం, రెడ్డిగూడెం గ్రామాల్లో సభలు ఏర్పాటుచేసి కేటాయించిన బడ్జెట్‌ను వివరించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పూజల వెంకట కోటయ్య, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ నర్రా బాబురావు, యార్డు చైర్మన్ మోహన్, ఆర్డీవో శ్రీనివాసరావు, పంచాయతీ డిఇ బ్రహ్మయ్య, రామకృష్ణ, పులిచింతల ప్రత్యేక అధికారి వెంకట సుబ్బయ్య, రామ్మోహనరావు, నాగన్న, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.