గుంటూరు

తరలింపుతో కొత్త ఊపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 24: కార్యాలయాల తరలింపు కొత్త ఊపును సంతరించుకుంటోంది. ఏ శాఖ పరిధిలో కార్యాలయాలను, ఆ శాఖల తరలింపు బాధ్యతలను మంత్రులకు అప్పగించడంతో ప్రారంభోత్సవాలకు పోటీ పడుతున్నారు. గుంటూరుకు ఇప్పటికే ఆచార్య ఎన్‌జి రంగా విశ్వవిద్యాలయ ప్రధాన శాఖతో పాటు మార్కెటింగ్, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, చేనేత జౌళిశాఖ, సాంఘిక సంక్షేమశాఖ ప్రధాన కార్యాలయాలను తరలించారు. తాజాగా శుక్రవారం సహకార శాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు. హైదరాబాదు నుంచి సుమారు 150 మంది ఉద్యోగులు ప్రత్యేక బస్సుల్లో తరలివచ్చారు. ఇలా ఉండగా వ్యవసాయశాఖ కమిషనరేట్ కార్యాలయాన్ని మంత్రి పుల్లారావు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే సచివాలయం నుంచి సామాగ్రిని కార్యాలయానికి తరలించారు. హోంశాఖ కార్యాలయాన్ని కూడా మంగళగిరిలో ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. తాత్కాలిక సచివాలయంలో ఈనెల 29 నుంచి ఉద్యోగులు విధులు నిర్వర్తించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేయడంతో ఎడా పెడా ఉద్యోగులు తరలివస్తున్నారు. వీరికి తాత్కాలిక వసతి కల్పించడం కృష్ణా, గుంటూరు జిల్లా కలెక్టర్లకు శిరోభారంగా మారింది. గుంటూరు నగరంలోని పలు కళ్యాణ మండపాల్లో ఉద్యోగులకు వసతి సదుపాయాలు కల్పిస్తున్నారు.