గుంటూరు

యంత్ర పరికరాల కొనుగోలుకు రైతులకు సబ్సిడీపై రుణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిరంగిపురం, జూలై 7: బ్యాంకింగ్ సౌకర్యాన్ని గ్రామీణ ప్రాంతవాసులకు అతి చేరువలోకి తీసుకురావటమే చైతన్య గ్రామీణ గోదావరి బ్యాంకు లక్ష్యమని జిఎం ఆర్వీ ఫణికుమార్ పేర్కొన్నారు. గురువారం వేములూరిపాడు గ్రామంలో గ్రామీణ చైతన్య గోదావరి బ్యాంకు శాఖను లాంఛనంగా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ 1975 సంవత్సరంలో స్థాపించిన తమ బ్యాంకు క్రమేణా గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో 102 శాఖలుగా విస్తరించి 5,600 కోట్ల టర్నోవర్‌తో గ్రామీణ ప్రజలకు సేవలందించటంలో ముందుందని అన్నారు. కమర్షియల్ బ్యాంకులకు దీటుగా కేంద్ర ప్రభుత్వ మూలధనం 50 శాతం, ఆంధ్రా బ్యాంకు 30 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 15 శాతం భాగస్వామ్యంతో నడుస్తున్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ అని తెలిపారు. గ్రామీణ ప్రాంత వాసులకు బ్యాంకు సౌకర్యం చేపట్టిన నేపథ్యంలో రైతులకు పంటరుణాలు, డ్వాక్రా మహిళలకు లింకేజీ రుణాలు, విద్యార్థులకు రుణ సదుపాయం, బంగారంపై తక్కువ వడ్డీకి రుణాలు, యంత్రపరికరాల కొనుగోలుకు సబ్సిడీపై రుణాలను అందిస్తున్నట్లు వివరించారు. అధ్యక్షత వహించిన సీనియర్ ఇనస్పెక్టర్ ఎస్‌జె కెనడీ మాట్లాడుతూ డిపాజిట్లపై 1/2 శాతం వడ్డీ రాయితీ కల్పిస్తామన్నారు. 2వేల 500 మంది జనాభా ఉన్న ప్రాంతంలో ఒక శాఖను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. అనంతరం బ్యాంకు మేనేజరు జి సువర్ణరాజు మాట్లాడుతూ గురువారం నుండి లాంఛనంగా ప్రారంభమైన ఈ శాఖ ఈనెల 15వ తేదీ నుండి పూర్తిస్థాయిలో ప్రజలకు సేవలందించగలదన్నారు.
అనంతరం బ్యాంకులో నూతనంగా ఏర్పాటుచేసిన సేఫ్టీ లాకర్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో పలు శాఖల మేనేజర్లు ధనుంజయ, సత్యానందం, మధుకుమార, ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు.