గుంటూరు

హరిత కోటప్పకొండగా తీర్చిదిద్దాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసరావుపేట, జూలై 7: కోటప్పకొండ ప్రాంతంలో సుమారు పదివేల మొక్కలను నాటి హరిత కోటప్పకొండగా తీర్చిదిద్దాలని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. గురువారం కోటప్పకొండలోని మొక్కలు నాటిన అనంతరం మాట్లాడారు. ఈ కార్యక్రమానికి డీఎఫ్‌వో మోహన్‌రావు అధ్యక్షత వహించారు. కోటప్పకొండలోని ఘాట్‌రోడ్డు, పర్యాటక కేంద్రం, కొండ ఎగువ, దిగువ ప్రాంతాల్లో అందమైన మొక్కలను నాటాలని సూచించారు. పార్యవరణంతో పాటు ఆహ్లాదం కలుగుతుందని అన్నారు. కోటప్పకొండలో పచ్చని చెట్లు ఆకర్షనీయంగా ఉంటాయని, భక్తులను, పర్యాటకులను చెట్లు బాగా ఆకట్టుకుంటాయని అన్నారు. అటవీ శాఖాధికారులు జిల్లాలో ఎన్ని మొక్కలు కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నారని, వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇండోనేషియా నుండి వచ్చిన జావా పక్షులను పర్యాటక కేంద్రంలో విడిచిపెట్టారు. కోటప్పకొండ క్షేత్రంలోని వేదపాఠశాలలో ఈ ఏడాది 45మంది విద్యార్థులు వేదాలను నేర్చుకుంటున్నారని వచ్చే ఏడాదికి ఈ సంఖ్య వందకు పెరగనుందని అన్నారు. వేదపాఠశాల ప్రిన్సిపల్ మార్తి వెంకటరామశాస్ర్తీ మాట్లాడుతూ తమ పాఠశాల ఆవరణలు నాటేందుకు మొక్కలను సంబంధింత అధికారులు అందచేయాలని కోరారు. దీనిపై స్పీకర్ మాట్లాడుతూ ఎన్ని మొక్కలు కావాలన్నా అటవీ శాఖాధికారులు అందచేస్తారని తెలిపారు.