గుంటూరు

గుబాళించిన రంజాన్ ఆధ్యాత్మిక సుమసుగంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), జూలై 7: మల్లెపూవు లాంటి తెల్లని వస్త్రాలను ధరించి నగరంలోని వేలాదిమంది ముస్లింలు గురువారం పవిత్ర రంజాన్ పండుగను జరుపుకోవడమే గాక అల్లా అనుగ్రహం అందిరిపై వర్షించాలని కోరుతూ ప్రధాన ఈద్గాలు, మసీదులకు తరలివెళ్లి ప్రార్థనలు చేశారు. గత నెలరోజులుగా ఉపవాస దీక్షలను నియమనిష్టలతో ఆచరిస్తూ వస్తున్న ముస్లింలు వారి కుటుంబాలు గురువారం రంజాన్ నమాజ్ అనంతరం విందును స్వీకరించారు. ఈ సందర్భంగా నగరంపాలెంలోని కెఎమ్ ఇంటర్నేషనల్ వద్ద గల ముఖ్య ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన రంజాన్ నమాజ్‌ల్లో 30వేల మందికి పైగా ముస్లింలు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఉదయం రెండు పర్యాయాలు ముఫ్తీ ఖురాన్ పవిత్ర గ్రంథంలోని సూక్తులను పఠించి, రంజాన్ ప్రాముఖ్యతను తెలియజేశారు. ప్రేమ, కరుణ, దయార్ద్ర హృదయం, సాటి మనిషికి సహాయం చేయడం తదితర లక్షణాలతో ఈ రంజాన్ మాసంలోనే గాకుండా జీవిత పర్యంతం ప్రతి ముస్లిం ఇస్లాం సంప్రదాయానికి అనుకూలంగా జీవనాన్ని కొనసాగించాలన్నారు. జిల్లాకు చెందిన మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు అనేక మంది ప్రముఖులు ముస్లింలకు వారి కుటుంబాలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. పరస్పరం ఆలింగనం చేసుకుని తమ ఆత్మీయతను చాటుకున్నారు. ఈ సంవత్సరం రంజాన్ పండుగను రాష్ట్ర ప్రభుత్వ పండుగగా ప్రకటించటంతో అధికార యంత్రాంగం, ముస్లిం వక్ఫ్ బోర్డు , అంజుమన్ ఇస్లామియన్ కమిటీ రంజాన్ ప్రార్థనల కోసం విస్తృత ఏర్పాట్లు చేశాయి.