గుంటూరు

పానకాలస్వామి సన్నిధిలో గవర్నర్ నరసింహన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, జూలై 7: రాష్ట్ర గవర్నర్ నరసింహన్ గురువారం ఉదయం మంగళగిరి విచ్చేసి కొండపై స్వయంభువైన పానకాల లక్ష్మీనరసింహ స్వా మిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. స్వామివారికి పానకం మొక్కుబడి తీర్చుకున్నారు. అనంతరం దిగువ సన్నిధిలోని లక్ష్మీ నరసింహ స్వామి, రాజ్యలక్ష్మీ అమ్మవారిని నరసింహన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. సంప్రదాయ బద్ధంగా ఆలయంలో ప్రదక్షిణలు చేసి ధ్వజ స్తంభానికి మొక్కారు. తొలుత ఆలయ ముఖద్వారం వద్ద గవర్నర్‌కు రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి పత్తిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే స్వాగతం పలికారు. దేవాదాయ శాఖ డెప్యూటీ కమిషనర్ సురేష్‌బాబు, అసిస్టెంట్ కమిషనర్ కెబి శ్రీనివాస్ ఆలయం తరఫున నరసింహన్‌కు స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు దీవి అనంత పద్మనాభాచార్యులు, నల్లూరి శ్రీరామచంద్ర భట్టాచార్యులు ఆలయ ముఖమండపంలో గవర్నర్‌ను ఆశీర్వదించి తీర్థాన్ని అందజేశారు. మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి, ఆలయ ధర్మకర్తలు ఆలేటి నాగలక్ష్మి, ఎవి సాంబశివరావు, వెనిగళ్ల ఉమాకాంతం, ఊట్ల శ్రీమన్నారాయణ, కోసూరి శివనాగరాజు, మోరంపూడి నాగేశ్వరరావు, పంచుమర్తి ప్రసాద్, రావూరి శ్రీనివాస్ , ఎఎంసి వైస్‌చైర్మన్ మనె్నం రమేష్‌బాబు పాల్గొన్నారు.