గుంటూరు

అర్బన్‌బ్యాంక్ సేవలు విస్తరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), ఆగస్టు 8: అర్బన్ బ్యాంకు సేవలు గుంటూరు నగరంతో పాటు జిల్లా అంతగా విస్తరింపజేసి బ్యాంకును అభివృద్ధి పధంలో నడిపించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జివి ఆంజనేయులు పేర్కొన్నారు. అర్బన్ బ్యాంకు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన బోనబోయిన శ్రీనివాసయాదవ్‌ను సోమవారం ఎమ్మెల్యేలు జివి, ఆలపాటి రాజేంద్రప్రసాద్ తదితరులు పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాన్య, మధ్య తరగతి ప్రజలు, చిన్న చిన్న వ్యాపారస్తులకు బ్యాంకు సేవలు ఉపయోగపడేలా చూడాలన్నారు. బ్యాంకు డిపాజిట్లు 1000 కోట్లకు పెంచాలన్నారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ ఇతర బ్యాంకులతో పాటు పోటీ పడే విధానంతో ముందుకు సాగాలని సూచించారు. అర్బన్ బ్యాంకు ఛైర్మన్ బోనబోయిన శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ వినియోగదారులు, ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేలా కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా బ్యాంకు వ్యవస్థాపక అధ్యక్షుడు జాగర్లమూడి చంద్రవౌళి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జివైఎన్ బాబు, ఖాదర్‌బుడే, సామినేని శ్రీనివాసరావు, యడవల్లి నాగేశ్వరరావు, జొన్నలగడ్డ సాంబశివరావు, జాగర్లమూడి మురళీమోహన్, తెలుగుదేశం పార్టీ నాయకులు యాగంటి దుర్గారావు, కోవెలమూడి రవీంద్ర, కందుకూరి వీరయ్య, శనక్కాయల అరుణ, మద్దిరాల మ్యాని, వేములపల్లి శ్రీనివాస్, నల్లపనేని విజయలక్ష్మి, ముప్పాళ్ల మురళి, ముత్తినేని రాజేష్, సుఖవాసి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.