గుంటూరు

బీసీలకు సామాజిక భద్రత కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 30: దేశానికి స్వాతంత్య్రం లభించి 69 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ బిసిలకు సామాజిక భద్రత కరవైందని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డిమాండ్లను పరిష్కరించాలని బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఈడె మురళీకృష్ణ డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం కలెక్టరేట్ ఎదుట బిసి సంక్షేమ సంఘం నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ దేశంలోని 70 కోట్లమంది బిసిలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు ఇప్పటికీ కల్పించలేదన్నారు. ఉద్యోగులకు ప్రమోషన్లు అమలుచేయాలని, జడ్జిల నియామకాల్లో కూడా ప్రాధాన్యత కల్పించాలని కోరారు. సామాజిక భద్రత కోసం బిసి యాక్టును తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ధర్నా అనంతరం కలెక్టరేట్ ఎఒకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో తొలుచూరి శ్రీనివాస్, యామా మురళీకృష్ణ, బిట్రవెంట శివన్నారాయణ, ఆలా అనంతరామయ్య, కుంచాల వెంకట్రామయ్య, పోతురాజు శ్రీనివాసరావు, షేక్ ఆదంషఫీ, బాదుగుల శ్రీను, సిహెచ్ బాలయ్య తదితరులు పాల్గొన్నారు.