గుంటూరు

అంతర్ జిల్లా దొంగ, హంతకుడు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినుకొండ, మార్చి 21: స్థానిక మసీద్ మాన్యానికి చెందిన అంతర్ జి ల్లాల దొంగ, హంతకుడు, రౌడీ, పాత నేరస్థుపు షేక్ సయ్యద్ అల్లాబక్షును అరెస్ట్ చేసి, 90 వేల రూపాయలు విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్న ట్లు నరసరావుపేట డీఎస్పీ కె నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం స్థానిక పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సిఐ జీ శ్రీనివాసరావు, ఎస్‌ఐ జీవీ నారాయణతో కలిసి విలేఖరుల సమావేశంలో నిందితుడిని హాజరుపరిచారు. స్థానిక శ్రీనివాస్‌నగర్‌లోని ఆలపాటి సురేష్ ఇంట్లో ఫిబ్రవరి 10న జరిగిన చోరీకి పాల్పడిన దొంగ అల్లాబక్షును ఆదివారం సాయంత్రం ఏనుగుపాలెం రైల్వే గేటు వద్ద పట్టణ సిఐ జీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీస్ బృందాలు పట్టుకుని చోరికి గురైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అల్లాబక్షు 2012లో నాగులూరు కుమారి అనే మహిళతో సంబంధం పెట్టుకుని ఆమె రెండేళ్ళ కుమార్తె విజయను హత్య చేసిన కేసులో నిందితుడుగా ఉన్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లాలోని అద్దంకి, సంతమాగులూరు, రాజుపాలెం తదితర దేవాలయాల్లో హుండీలను చోరీ చేయడంతో పాటు, త్రిపురాంతకం, అద్దంకి తదితర గ్రామాల్లో చోరీ కేసుల్లో నేరస్థుడన్నారు. దొంగను పట్టుకున్న వినుకొండ పోలీసులకు జిల్లా ఏస్పీ అవార్డులు ప్రకటించనున్నట్లు తెలిపారు. పట్టణంలో ఇటీవల జరిగిన దొంగతనాల కేసుల్లో తమకు ఆధారాలు లభ్యమయ్యాయని, త్వరలో ఆ దొంగలను కూడా పట్టుకుంటామన్నారు.