గుంటూరు

బ్రాహ్మణ కార్పొరేషన్‌లో దళారులకు తావు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 11. బ్రాహ్మణ కార్పొరేషన్‌లో దళారుల ప్రమేయానికి తావు లేదని కార్పొరేషన్ చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పష్టం చేశారు. ఆదివారం గుంటూరు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కార్పొరేషన్ ద్వారా అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం 65 కోట్లు మంజూరు చేసిందని, మరో 65 కోట్లు అదనంగా విడుదల చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. గత ఏడాది 11 వేల 107 మంది లబ్ధిదారులకు 31.5 కోట్ల మేర ప్రయోజనం చేకూరిందని తెలిపారు. ఈ ఏడాది 24 వేల మంది లబ్ధిదారులకు 10375 మందిని ఎంపిక చేసి 10.42 కోట్లు పంపిణీ చేశామన్నారు. వ్యవస్థీకృత ఖర్చులు తగ్గించుకుని అవినీతి రహిత సేవలు అందించటమే ప్రధాన కర్తవ్యమన్నారు. కార్పొరేషన్ నిర్వహించే కార్యక్రమాల సందర్భంగా దండలు, శాలువలకు అయ్యే ఖర్చులను నియంత్రించాలని, ఆ సొమ్మును అక్షయ బ్రహ్మ నిధికి అందించాలని సూచించారు. నిర్వహణ వ్యయం తక్కువ ఉండేలా నియంత్రణ చర్యలు చేపట్టామన్నారు. కొద్దిమందితో ఎక్కువ సేవలు కల్పించే విధంగా బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తుందని చెప్పారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు గాయత్రి పథకం ద్వారా 10 వేల ప్రోత్సాహం, పోటీ పరీక్షలకు వశిష్ట పథకం కింద ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ పాఠశాలలు, ప్రభుత్వ ఎయిడెడ్ విద్యా సంస్థల్లో చదువుతున్న ఒకటి నుంచి పదో తరగతి పేద విద్యార్థులకు రు. 5 నుంచి 10 వేల వరకు ఉపకార వేతనాలు అందజేస్తామని వివరించారు. ఇంటర్ నుంచి పిజి విద్యార్థులకు కూడా ఈ సాయం అందుతుందన్నారు. అనాధలు, మానసిక వికలాంగులైన బ్రాహ్మణులకు అవసరమైన ఖర్చులో కొంత కార్పొరేషన్ భరిస్తుందని వెల్లడించారు. చాణక్య స్వయం ఉపాధిలో భాగంగా నిరుద్యోగ బ్రాహ్మణ యువతకు బ్యాంకుల ద్వారా నాలుగు రకాల సబ్సిడీపై రుణాలు మంజూరవుతాయని తెలిపారు. ద్రోణాచార్య పథకం కింద నైపుణ్యతా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇకపై నిష్ణాతులైన పదిమంది రిటైర్డు ఐఎఎస్, ఐపిఎస్ ఉన్నతాధికారులతో జిల్లాల వారీ పర్యటనలు జరిపి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. 50 ఏళ్లు పైబడిన వృద్ధులు, 2.5 లక్షల వార్షికాదాయం కలిగిన వారికి చరక ఆరోగ్య బీమా పథకాన్ని అమలుచేస్తున్నామని తెలిపారు. కశ్యప ఆహార - నివాస పథకం ద్వారా ఇటీవల వరకు పెన్షన్లు పంపిణీ చేశామని, కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకుని వీటిని పునరుద్ధరిస్తామని ప్రకటించారు.
సమాజ హితమే బ్రాహ్మణుల లక్ష్యం
అనాదిగా పేదరికంలో మగ్గుతూ సమాజ హితాన్ని కాంక్షించింది బ్రాహ్మణ కులస్థులే అని రిటైర్డు డిజిపి అరవిందరావు అన్నారు. అర్థాకలితో ఉంటూనే ధర్మ ప్రచారం, సమాజ సేవలో బ్రాహ్మణులు మమేకం అవుతున్నారని తెలిపారు. తన బాగుతో సమాజంలో అన్ని వర్గాలను ఐక్యం చేస్తున్నారని వివరించారు.