గుంటూరు

సర్ట్ఫికెట్ల కోసం విద్యార్థుల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున యూనివర్సిటీ, సెప్టెంబర్ 29: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని గుంటూరు జిల్లాకు చెందిన సాధుల్లా బియిడి కళాశాలకు చెందిన విద్యార్థులు తమ సర్ట్ఫికెట్లు తమకు ఇప్పించాలని కోరుతూ గురువారం వ ర్సిటీలోని రిజిస్ట్రార్ చాంబర్ వద్ద ఆం దోళన చేశారు. సాధుల్లా కళాశాలలో బియిడి పూర్తి చేసుకున్న పశ్చిమబెంగాల్, ఒరిస్సాలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు రి జిస్ట్రార్ ఛాంబర్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వి ద్యార్థులు మాట్లాడుతూ కళాశాల, వ ర్సిటీల మధ్య ఉన్న వివాదాల వల్ల తా ము నష్టపోతున్నామని, గతంలో కోర్టు ఆదేశాల మేరకు పరీక్షలు నిర్వహించిన అధికారులు ఫలితాలను నిలుపుదల చేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ఉఫాధి అవకాశాలను కోల్పోతున్నామని, ఇప్పటికైనా వర్సిటీ అధికార్లు మానవతా దృక్పథంతో తమ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను వెల్లడించి, సర్ట్ఫికెట్లు ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు. వర్సిటీ రిజిస్ట్రార్ శుక్రవారం సాయంత్రంలోగా సమస్యను పరిష్కరిస్తామని తమకు హామీ ఇచ్చారని వారు తెలిపారు.