గుంటూరు

పోలీసుల త్యాగాలు వృథాకావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 21: కర్తవ్య నిర్వహణలో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ అందించిన పోలీసుల త్యాగాలు వృథాకావని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఉద్ఘాటించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం పరెడ్ గ్రౌండ్స్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. నగరంపాలెం సెంటర్ వద్దగల అమరవీరుల స్తూపానికి మంత్రులు ప్రత్తిపాటి, రావెల కిషోర్‌బాబు, కలెక్టర్ కాంతీలాల్ దండే, జడ్పీ చైర్‌పర్సన్ జానీమూన్, గుంటూరు రేంజి ఐజి ఎన్.సంజయ్, అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి, రూరల్ ఎస్పీ కె.నారాయణ నాయక్‌లు పుష్పగుచ్ఛాలు సమర్పించి నివాళులర్పించారు. వారోత్సవాల సందర్భంగా విజేతలైన విద్యార్థులు, పోలీసులకు బహుమతి ప్రదానం చేశారు. మంత్రులు, పోలీసు అధికారులు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ ప్రభుత్వం పోలీసుల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ద వహిస్తోందని తెలిపారు. విధి నిర్వహణలో త్యాగాలందించిన వారి కుటుంబాలకు చేయూత నందించటంతో పాటు ప్రత్యేకంగా ఆదుకుంటుందని తెలిపారు. మంత్రి రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ సమాజ సేవలో పోలీసులపాత్ర అనిర్వచ నీయమన్నారు. అసాంఘికశక్తుల అణచివేతలో ప్రజలు సహకరించాలని విజ్ఞప్తిచేశారు. కలెక్టర్ కాంతీలాల్ మాట్లాడుతూ ఒత్తిళ్లకు తలొగ్గ కుండా విధులు నిర్వహిస్తున్న పోలీసులు మరింత క్రమశిక్షణతో ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అర్బన్ జిల్లా అదనపు ఎస్పీలు జె.్భస్కరరావు, ఇ.సుబ్బరాయుడు, బి.తిరుపాల్, ఒఎస్‌డి సుధాకర్, రూరల్ అదనపు ఎస్పీ వీరభద్రుడు, వెస్ట్ డిఎస్పీలు కెజివి సరిత, ఎ.వి శివప్రసాద్, సిఐలు సిహెచ్ కోటేశ్వరరావు, ఎండి హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.