గుంటూరు

విద్వేషాలను రెచ్చగొడుతున్న తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 4: రాష్ట్రంలో, కుల, మత, ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు ఆటంకాలు సృష్టిస్తున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సిహెచ్ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను అన్నివిధాలా అభివృద్ధి పథంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రోజుకు 18 గంటలు కష్టపడుతుంటే నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన వైసిపి కుట్రలు, దుష్ప్రచారాలు చేస్తుందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా సింగపూర్, మలేషియాతో పాటు ఇతర దేశాల కంపెనీ ప్రతినిధులకు ఈ మెయిల్స్ పంపిన చరిత్ర వైసిపి అధినేత జగన్మోహనరెడ్డిదని అన్నారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా పరిశ్రమల ప్రగతి ఆగలేదని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఎపి నెంబర్ వన్ స్థానాన్ని సాధించి పెట్టుబడుల అనుకూలత రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉందని ఇటీవల రిజర్వుబ్యాంకు ప్రకటించిందన్నారు. లక్షా 50 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు వచ్చాయని, వాటిద్వారా 2.50 లక్షల ఉద్యోగాలు కల్పించడం జరిగిందన్నారు. మెగా ఆక్వా ఫుడ్ పరిశ్రమ విషయంలో ఒకవైపు పరిశ్రమలు రావాలని అంటూ, మరోవైపు రైతులను రెచ్చగొట్టేందుకు జగన్ కుట్రలు పన్నుతున్నారన్నారు. విజయనగరం జిల్లా, భోగాపురంలో నిర్మించతలపెట్టిన ఎయిర్‌పోర్ట్ విషయంలోనూ జగన్ అడ్డు తగిలారని, పోలవరం నిర్మాణం పూరె్తైతే జగన్ ఉనికి కోల్పోతారన్న భయంతో తన పార్టీ నేతలతో కేసులు వేయించారని ఆరోపించారు.

జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు
ఎఎంజి విద్యార్థులు
చిలకలూరిపేట, నవంబర్ 4: జాతీయస్థాయి బాస్కెట్ బాల్ స్కూల్‌గేమ్స్ పోటీలకు ఎఎంజి విద్యార్థులు ఎంపిక కావడం సంతోషకరమని సంస్థ డైరెక్టర్ అరుణ్‌కుమార్ మహంతి అన్నారు. గత నెల పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగిన రాష్టస్థ్రాయి పోటీల్లో ప్ర తిభ కనబర్చిన అండర్-14 బాలుర వి భాగంలో అన్నలదాసు సంజయ్‌బా బు, బాలికల విభాగంలో త్రివేణి ఈ నెలలో ఛత్తీస్‌ఘడ్‌లో జరిగే జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ క్రీడలకు ఎన్నికయ్యారు. వీరిని సంస్థ ఉపాధ్యక్షుడు జాకబ్, సిఇఒ విజయకుమార్, హెచ్‌ఎం మేరి, పిఇటిలు రాజు, రాజేష్, కొండలు, జ్యోతిలు అభినందించారు.