గుంటూరు

న్యాయం చేయాలని..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినుకొండ, నవంబర్ 4: తనకు న్యాయం చేయాలని, లేకపోతే దూకి ఆత్మహత్య చేకుకుంటానని శుక్రవారం పట్టణంలోని బిఎస్‌ఎన్‌ఎల్ టవర్ ఎక్కి ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. వివరాలలోకి వెళ్తే. ఈపూరు మండలం, బొమ్మరాజుపల్లి గ్రామానికి చెందిన సంగం ముసలయ్య భార్య రమణమ్మ పేరుతో ఎన్టీఆర్ గృహనిర్మాణం పథకం కింద ఇల్లు మంజూరు అయ్యింది. అయితే భార్య మూడు నెలల కిందట చనిపోయింది. భార్య చని పోయినందున ముసలయ్యకి ఇళ్లు రాదని హౌసింగ్ ఎఈ తెలిపారు. గృహం నిర్మించు కోవాలంటే 20వేల రూపాయల లంచంగా ఇవ్వాలని హౌసింగ్ ఎఈ అడిగారని, ధ్రువపత్రాల కోసం రెవిన్యూ అధికారుల వద్దకు వెళ్తే వారు కూడా లంచం అడిగారని, చివరకు ఎంపిటిసి కూడా తమ వాటా ఇవ్వాలని చెప్పడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడడానికి సిద్ధపడ్డాడు. ఈ నేపథ్యంలోనే వినుకొండకు వచ్చి సెల్‌టవర్ ఎక్కి కిందకు దూకేందుకు ప్రయత్నించగా స్థానికులు ఈ విషయాన్ని గమనించారు. ముసలయ్యను దించడానికి పట్టణ సిఐ జి శ్రీనివాసరావు, సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈపూరు తహశీల్దార్, హౌసింగ్ ఎఈ, ఎంపిటిసి వచ్చి హామీ ఇస్తే తప్ప సెల్ టవర్ దిగనని మొండికేశాడు. రాత్రి 7.30వరకు సెల్ టవర్ దిగలేదు. దీంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. ఎట్టకేలకు పోలీసులు ముసలయ్యకు నచ్చజెప్పి, కిందకు దింపి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.