గుంటూరు

సమీకరణకు రాకుంటే భూ సేకరణే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), ఏప్రిల్ 25: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం 23 గ్రామాల్లో 95 శాతం మంది రైతులు స్వచ్ఛంధంగా భూములిచ్చారని, భూ సమీకరణకు రాని రైతులకు భూ సేకరణ చేపడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. సోమవారం సచివాలయ ప్రారంభోత్సవం అనంతరం జరిగిన బహిరంగ సభలో సిఎం రైతులనుద్దేశించి మాట్లాడారు. కొందరు రాజధానిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని, ఈ ప్రాంతంలో అసమ్మతి, ఆందోళన జరిగితే రైతులకే నష్టమన్న విషయాన్ని గుర్తెరగాలన్నారు. ఈ సందర్భంగా రైతు మువ్వా నాగేశ్వరరావు మాట్లాడుతూ జరీబుతో పాటు మెట్టప్రాంతంలో భూములున్నాయని, భూ సమీకరణ కింద ఇచ్చేందుకు తాము సిద్ధమని, ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీని తనకు, తన పిల్లలకు చెందేవిధంగా ఇవ్వాలని సిఎంను కోరడంతో రిజిస్ట్రేషన్ అయిన ప్రకారం అధికారులు పరిశీలించి రాజధానికి భూములిచ్చిన రైతుల ప్యాకేజీ ప్రకారమే తమ భూములకు కూడా ఇస్తామని చెప్పారు. అలాగే కొంతమంది రైతులు రాజధాని నిర్మాణ కమిటీల్లో రైతుల పేర్లు కూడా ఉంచాలని సిఎం దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఉండవల్లి, పెనుమాక ప్రాంతాల్లో కూడా రైతులు రాజధాని నిర్మాణాలకు స్వచ్ఛంధంగా భూములిచ్చారని, సిఎం తుళ్లూరు ప్రాంత రైతులకే కృతజ్ఞతలు తెలుపుతున్నారని, మమ్మల్ని మరిచారంటూ మరో రైతు ఆక్షేపించడంతో భూములిచ్చిన రైతులందరికీ పాదాభివందనమంటూ సభా కార్యక్రమాన్ని ముగించారు.

రైతులకు 10 లక్షల వరకు
వన్‌టైం సెటిల్‌మెంట్‌కు బ్యాంకుల అంగీకారం: ప్రత్తిపాటి
మంగళగిఠి, ఏప్రిల్ 25: పారిశ్రామికవేత్తల మాదిరిగా బ్యాంకుల్లో బకాయి ఉన్న రైతులకు 10 లక్షల వరకు వన్‌టైం సెటిల్‌మెంట్‌కు బ్యాంకులను ఒప్పించడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. సోమవారం మంగళగిరిలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ గతంలో బ్యాంకుల్లో బకాయి ఉండి నష్టాల పాలైన రైతులకు లక్ష రూపాయల వరకు వన్‌టైం సెటిల్‌మెంట్ ఉండేదని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవతో రుణమాఫీ పరిధిలోకి రాని రైతులకు కూడా మేలు చేయాలనే ఉద్దేశ్యంతో బ్యాంకర్లతో మాట్లాడి 10 లక్షల రూపాయల వరకు వన్‌టైం సెటిల్‌మెంట్ కోరగా బ్యాంకర్లు అంగీకరించారని, పేయింగ్ కెపాసిటీని బట్టి ఆయా బ్యాంకర్లు దీన్ని అమలు చేస్తారని పుల్లారావు పేర్కొన్నారు. రైతులకు రుణమాఫీ రెండో విడత 20 శాతం అందజేసేందుకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 3,200 కోట్ల రూపాయలు విడుదల చేశారని ఆయన అన్నారు. రాజధాని కోసం భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు వచ్చే నెల 30వ తేదీ నెలపాడు గ్రామంనుంచి ప్రారంభమవుతుందని పుల్లారావు అన్నారు. కచ్చా రోడ్లు కూడా ప్లాన్ చేస్తున్నామని, సీడ్ క్యాపిటల్‌కు రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచామని, చాలా తక్కువ వ్యవధిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణం జరుగుతుందని మంత్రి పుల్లారావు అన్నారు. మాస్టర్ ప్లాన్ డిజైన్ చేయడం, ప్రకటన చేసి అభ్యంతరాలు స్వీకరించడం లాంటి పనులు సాంకేతిక పరమైన విధానంతో వెళుతున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యక్తిగతంగా రాజధాని నిర్మాణంపై పర్యవేక్షణ చేస్తున్నారని అన్నారు. భూ సమీకరణలో అటవీ, అసైన్డ్ భూములకు సంబంధించి ఉన్న వివాదాలను న్యాయపరంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని, ఇవన్నీ 500 ఎకరాల్లోపే ఉంటాయని ఆయన అన్నారు. మంచినీటి సమస్య పరిష్కారానికి జిల్లాకు 25 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. మంగళగిరి ప్రాంతంలో విద్యుత్ కోత తరచుగా విధింపుపై ఉన్నతాధికారులతో మాట్లాడతానని మంత్రి పుల్లారావు అన్నారు. ఉచిత ఇసుక విధానంలో తెలుగుదేశంతో సహా ఏ పార్టీ నేతలైనా అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్ అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారని, ప్రతి పేదవాడికి ఇసుక ఉచితంగా అందాలన్నదే లక్ష్యమని పుల్లారావు పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరికపై అడిగిన ప్రశ్నకు పుల్లారావు స్పందిస్తూ ఫిరాయింపుల పితామహుడు వైఎస్ రాజశేఖరెడ్డేనని, గతంలో పీవీ నరసింహారావు ప్రభుత్వం మైనార్టీలో ఉన్నప్పుడు ఏడుగురు టిడిపి ఎంపీలను అణు ఒప్పందం బిల్లు నెగ్గించుకునేందుకు 6 టిడిపి ఎంపీలను కాంగ్రెస్‌లోకి చేర్పించడంలో వైఎస్ కీలక పాత్ర పోషించారని పుల్లారావు అన్నారు.
జగన్‌లో అహంకారం, డబ్బుంది కదా అనే లెక్కలేనితనం, నియంతలా వ్యవహరించడం వల్లే ఎమ్మెల్యేలు ఆయన పార్టీ విడిచి టిడిపిలోకి వస్తున్నారని, తన పార్టీకి పూర్తి మెజార్టీ ఉందని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం లేదా ప్రలోభ పెట్టడం లాంటివి చేయాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని పుల్లారావు అన్నారు. మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి, ఆప్కో చైర్మన్ ఎం హనుమంతరావు, జడ్‌పి మాజీ చైర్మన్ పాతూరినాగభూషణం, టిడిపి నేతలు దండమూడి మనోజ్, వి సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

నేత్రపర్వంగా పునఃప్రతిష్ఠా మహోత్సవం
తాడికొండ, ఏప్రిల్ 25: శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి ఆలయ పునఃప్రతిష్ఠా మహోత్సవం మండల పరిధిలోని పాములపాడు గ్రామంలో సోమవారం ఉదయం 10.36 గంటలకు నేత్రపర్వంగా జరిగింది. ఈ దేవాలయ ప్రాంగణంలో పూర్వపు స్థితి కంటే ఉన్నతమైన స్థితిలో శ్రీ మల్లేశ్వరస్వామివారి ప్రధాన ఆలయం భ్రమరాంబ అమ్మవారి ఉప ఆలయం, శ్రీ గణపతి ఉప ఆలయం, శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిఉప ఆలయం, విశాలమైన ముఖ మండపం, నందీశ్వర, చండీశ్వర, ద్వార పాలకులతో సహా నవగ్రహ ఆలయం, ఆలయానికి ఎదురుగా మహారాజ గోపుర నిర్మాణం, చక్కని ప్రాకారానికి వెలుపల చక్కని ఆధ్యాత్మిక వాతావరణం కల్పిస్తూ దేవతామూర్తుల విగ్రహాలను ఏర్పాటుచేశారు. సహకరించిన భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. వేకువఝామునుంచే భక్తులు ఆలయాన్ని సందర్శించారు. అనంతరం అన్నదానం జరిగింది.

ముఠా కార్మికుల ఒకరోజు సమ్మె
సత్తెనపల్లి, ఏప్రిల్ 25: స్థానిక చౌకడిపోలకు సరుకులను ఎత్తే పాయింట్‌లో పనిచేసే కార్మికులు ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడంతో సోమవారం ఒక్కరోజు సమ్మెకు దిగారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచుతామని నిర్వాహకులు హామీనిచ్చారు. యూనియన్ నాయకులతో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ ఇచ్చిన హామీలు నెరవేరక పోవడంతో సమ్మెకు దిగాల్సివచ్చిందని యూనియన్ నాయకులు తెలిపారు. ఈ విధంగానైనా ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చేందుకే ఈ ప్రయత్నం అని వివరించారు. మార్కెట్ యుర్డు నుండి కార్మికులు ర్యాలీగా తహశీల్దారు కార్యాలయానికి చేరుకొని కార్యాలయ సూపరింటెండెంట్ కె సూరిబాబుకి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సమ్మెలో కోటా పుష్పరాజ్, చింతపల్లి రమేష్, మాల్లా వెంకయ్య, రామారావు, సిహెచ్ యాకోబు, డేవిడ్‌రాజు, ముక్కంటి తదితరులు పాల్గొన్నారు. సిఐటియు జిల్లా నాయకులు గుంటూరు విజయకుమార్, పట్టణ అధ్యక్షుడు మామిడి జగన్నాధరావు, డివైఎఫ్‌ఐ పట్టణ అధ్యక్షుడు అనుముల రామయ్య, చేనేత కార్మిక సంఘ రాష్టన్రాయకులు కట్టా శివదుర్గారావు ముఠాకార్మికుల సమ్మెకు మద్దతు పలికారు.