గుంటూరు

సహ చట్టం పూర్తిస్థాయి అమలుకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజారు), ఏప్రిల్ 25: ప్రజలకు సేవలు అందించాల్సిన కీలకశాఖలైన వైద్యారోగ్య, విధానపరిషత్, మెడికల్ కళాశాలలు, ప్రభుత్వాసుపత్రుల్లో సమాచార హక్కు చట్టం పూర్తిస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఫోరం ఫర్ ఆర్‌టిఐ వ్యవస్థాపక, గౌరవాధ్యక్షులు ఈమని హనుమంతరావు, వాకా శ్రీనివాసరావులు కమిషనర్ విజయనిర్మలను కోరారు. ఈ మేరకు వారు సోమవారం విజయవాడలో స్టేట్‌గెస్ట్‌హౌస్‌లో సమాచార హక్కు చట్టం కమిషనర్ విజయ నిర్మలను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వశాఖల్లో సమాచార హక్కు చట్టం అమలుతీరుపై ఆమెకు వివరించారు. సమాచారం కోసం దరఖాస్తుదారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పౌర ప్రజా సమాచార అధికారులు సహకరించడం లేదని విన్నవించారు. స్పందించిన కమిషనర్ విజయనిర్మల మాట్లాడుతూ ఆయా శాఖల కార్యాలయాల్లో పౌర సమాచార అధికారులకు అవగాహన సదస్సులు నిర్వహించి దరఖాస్తు దారులకు పూర్తిస్థాయిలో సమాచారం అందేలా చర్యలు గైకొంటారన్నారు.

మండే ఎండలతో స్వర్ణపురివాసులు బెంబేలు
పొన్నూరు, ఏప్రిల్ 25: భానుడి ప్రతాపానికి స్వర్ణపురి ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. గత నాలుగు రోజులుగా సూర్యుడి భగభగలకు పొన్నూరు ప్రాంత ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉదయం 7 నుండే ఎండ తీవ్రతరం దాల్చడంతో 10 గంటలలోపే తిరిగి ఇళ్లకు పరుగెడుతుండటంతో వీధుల్లో జనసంచారం అంతగా కనిపించడం లేదు. మిట్టమధ్యాహ్నం వీధులు నిర్మానుషంగా దర్శనమిస్తున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు ఇదే పరిస్థితి. 6 గంటలు దాటితేనే ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు. భానుడి ప్రతాపానికి చెరువుల, కుంటలు, బావులు ఎండిపోయాయి. నాగేంద్రస్వామి పుట్టవద్ద బావి కొద్దిరోజుల క్రితమే ఒట్టిబోయింది. అక్కడికి వచ్చిన భక్తులకు చేతిపంపు నీరే ఆధారమైంది. మరో ఐదు రోజులు ఎండతీవ్రత ఇలానే ఉంటుందని అధికారులు చెప్తుండటంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. రోహిణికార్తెలో ఎండ తీక్షణత 50 డిగ్రీలు దాటనున్నట్లు పుకార్లు షికార్లు చేస్తుండటంతో ప్రజలు భయకంపితులవుతున్నారు.